Bigg Boss 4 Telugu weekend episodes:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో శనివారం పలు ఆసక్తికరైమన, ఆవేశపూరితమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి సింగర్ నోయల్ ( Singer Noel Sean ) బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి స్టేజ్ మీద కనిపించిన నోయల్... హౌజ్‌లో సభ్యుల గురించి మాట్లాడుతూ అవినాష్, అమ్మ రాజశేఖర్‌లపై ( Bigg Boss 4 contestants Avinash and Amma Rajasekhar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. బిగ్ బాస్ హౌజ్‌లో కొంత కాలంగా నోయ‌ల్ కాలి నొప్పితో తీవ్ర ఇబ్బంది ప‌డిన విష‌యం తెలిసిందే. ఐతే అత‌డి దీనావ‌స్థ‌ను చూసి జాలి ప‌డాల్సింది పోయి వెట‌కారాలు చేశార‌ట‌ తోటి కంటెస్టెంట్లు. Also read : Watch Nagarjuna taking charter flight: బిగ్ బాస్ 4 తెలుగు షూటింగ్ కోసం చార్టర్ ఫ్లైట్‌లో నాగ్


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

#BiggBossTelugu4 Today at 9 PM on @StarMaa


A post shared by STAR MAA (@starmaa) on


ఇదే విషయాన్ని నోయ‌ల్‌ ప్రస్తావిస్తూ.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్‌ల‌ను కాసేపు ఒంటికాలిపై నిల‌బ‌డ‌మ‌న్నాడు. కాసేప‌టి తరువాత నొప్పిగా ఉందా అని వారిద్దరిని అడిగాడు నోయల్.. వాళ్లు దానికి అవును చాలా నొప్పిగా ఉందని సమాధానం ఇచ్చారు. వారి సమాధానానికి నోయల్ స్పందిస్తూ.. '' మీరు ప‌డ్డ‌ నొప్పి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి నాకు రోజూ ఉంటుంది, దానిపై మీరు జోక్ చేశారు.. ఈ చిల్ల‌ర కామెడీలు ఏంట‌ి'' అని విమ‌ర్శించాడు. '' ఈ షోను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చూస్తారు. మీ ప్ర‌వ‌ర్త‌న‌తో వారికి ఏం చెప్పాల‌నుకుంటున్నారు'' అని ప్ర‌శ్నించాడు. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో జంటల మధ్య టైటిల్స్ చిచ్చు


దీంతో ఆగ్ర‌హించిన అవినాష్.. '' మీరు వెళ్తూ వెళ్తూ మా ఇద్ద‌రిని బ్యాడ్ చేయాల‌ని ఫిక్స‌య్యారు'' అని నోయ‌ల్‌పై మండిప‌డ్డాడు. ఒకానొక దశలో నోయల్‌పై అవినాష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఐతే నోయల్ మాత్రం అది తనకు పిచ్చ లైట్ అని రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ఎందుకు న‌టిస్తున్నావ్ అవినాష్‌ ? అంటూ అవినాష్‌కి కౌంట‌రిచ్చాడు. Also read : Bigg Boss Telugu 4: కొత్త కెప్టెన్‌గా అరియానా.. ఫీల్ అవుతున్న లాస్య, హారిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe