Bigg Boss Telugu 4: కొత్త కెప్టెన్‌గా అరియానా.. ఫీల్ అవుతున్న లాస్య, హారిక

Bigg Boss Telugu 4: Ariyana Wins captaincy Task  | బిగ్‌బాస్ తెలుగు 4 హౌస్ కొత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది. మెహబూబ్, అమ్మ రాజశేఖర్ సాయం చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4లో 9వ వారానికిగానూ కెప్టెన్‌గా అరియానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కానీ అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అరియానా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిపోాయాయి. 

Last Updated : Oct 30, 2020, 10:25 AM IST
Bigg Boss Telugu 4: కొత్త కెప్టెన్‌గా అరియానా.. ఫీల్ అవుతున్న లాస్య, హారిక

బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ కొత్త కెప్టెన్‌గా అరియానా గ్లోరి ఎంపికైంది. ఇంటి సభ్యులు మెహబూబ్, అమ్మ రాజశేఖర్ సాయం చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss 4 Telugu)లో 9వ వారానికిగానూ కెప్టెన్‌గా అరియానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ గురువారం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ వారం ఆడవాళ్లు కెప్టెన్ కావాలని వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. టాస్కు ఆడాల్సింది మాత్రం పురుష కంటెస్టెంట్స్. అంటే.. వీరి సహకారంతో మహిళా కంటెస్టెంట్స్‌లో ఒకరు కెప్టెన్ అవుతారు.

Also Read : Singer Noel: బిగ్ బాస్ హౌస్‌ను వీడిన సింగర్ నోయల్.. రీఎంట్రీ ఉంటుందా?

 

గార్డెన్ ఏరియాలో ఓ టేబుల్ మీద కీ, మరో బాక్స్ ఇచ్చారు. బజర్ మోగిన సమయంలో కీ చేజిక్కుంచుకున్న పురుష కంటెస్టెంట్.. మహిళా సభ్యులు వారు ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నారో విని తనకు నచ్చిన వారికి ఆ కీ ఇస్తారు. అప్పుడు ఆ మహిళా కంటెస్టెంట్ చెట్టు మీద ఉన్న ఆపిల్ కట్ చేసి ముక్కలు ముక్కలు చేయాల్సి ఉంటుంది. ఇది టాస్క్.

 

తొలుత అఖిల్ కీ దక్కించుకున్నాడు. అందరి వివరణ విని.. అందరూ అంతా ఊహించినట్లుగానే మొనాల్ గజ్జర్‌ను కెప్టెన్‌గా చూడాలని ఉందని చెప్పి, ఆమెకు కీ ఇచ్చాడు. టాస్క్ ప్రకారం మొనాల్ మరో కంటెస్టెంట్ హారిక యాపిల్ కట్ చేసి ఆమెను రేసు నుంచి బయటకు పంపుతోంది. రెండో కీ మెహబూబ్ చేజిక్కించుకోగా.. అరియానాకు కీ ఇస్తాడు. ఆమె లాస్య యాపిల్ కట్ చేసి కెప్టెన్సీ రేసు నుంచి ఆమెను బయటకు పంపుతుంది అరియానా. 

మూడో ప్రయత్నంలో అమ్మ రాజశేఖర్ విజయం సాధిస్తారు.  అరియానా, మొనాల్ వివరణ విన్న తర్వాత అరియానాకు కీ ఇస్తారు మాస్టర్. మొనాల్ యాపిల్‌ను కట్ చేస్తుంది అరియానా. దీంతో మొనాల్ రేసు నుంచి ఔట్ కావడంతో అరియానా బిగ్‌బాస్ తెలుగు 4 ఇంటి కొత్త కెప్టెన్ అవుతుంది. ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అంటూ అరియానా ఇంటి కెప్టెన్ అయింది. ఆపై ఆమె తీసుకున్న నిర్ణయంతో హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News