Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ కంటెస్టంట్స్ మధ్య బిగ్ ఫైట్.. హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్
Bigg Boss 4 Telugu nomination process updates: బిగ్ బాస్ హౌజ్‌లో ప్రతి వీకెండ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసి, సోమవారం రోజున నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఈ వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేసే క్రమంలో అఖిల్ ( Akhil), సోహెల్ ( Sohel) మధ్య వాగ్వీవాదం ఏర్పడి అది తీవ్ర స్థాయికి చేరింది.
Bigg Boss 4 Telugu nomination process updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోలో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌లో ప్రతి వీకెండ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసి, సోమవారం రోజున నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. సోమవారం రాత్రి గం.10.30 ల నుండి వోటింగ్ ప్రక్రియ ( Bigg Boss 4 Telugu voting numbers ) మొదలవుతుంది. కానీ, ఈ వారం నామినేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పటినుండి బిగ్ బాస్ ఇంటి సభ్యులు అసలైన ఆటను కనబరిచే సమయం ఆసన్నమయింది అని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు తెలిపాడు. ఈ మాటతో హౌజ్‌లో నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ మరింత సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేసే క్రమంలో అఖిల్ ( Akhil), సోహెల్ ( Sohel) మధ్య వాగ్వీవాదం ఏర్పడి అది తీవ్ర స్థాయికి చేరింది. ఒకరినొకరు బే అంటే బే అని దూషించుకునే వరకు వెళ్లింది. Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?
అంతకంటే ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో అఖిల్ ( BB4 contestant Akhil ) మాట్లాడుతూ.. "ఇంట్లో ఉండటానికి అర్హత ఉండాలి. పోతా పోతా అని మీరే పదిసార్లు అంటుంటారు. కాబట్టి వెళ్లడానికి మీరు రెడీ అయితే పంపించడానికి నేను కూడా రెడీనే" అని అమ్మ రాజశేఖర్ మాస్టర్ ( Amma Rajasekhar master ) తలపై గుడ్డు పగలగొట్టాడు. ఆ తరువాత ఇప్పటివరకు అఖిల్ ఎంతో క్లోజ్‌గా ఉంటున్న మోనాల్ గజ్జర్‌పై ( Monal Gajjar ) కూడా గుడ్డు పగలగొట్టి నామినేట్ చేయడం ఇంటిసభ్యులనే కాదు, ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. అయితే అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఏడో వారంలో కూడా అఖిల్, మోనాల్‌లో ఒకరు తప్పనిసరిగా నామినేట్ అవ్వాలి అనగా "బాగా ఆడేవాళ్లే హౌజ్‌లో ఉండాలి. నేను నీ కన్నా బాగా ఆడతాను" అంటూ మోనాల్‌ను నామినేట్ చేశాడు అఖిల్ ( Akhil nominates Monal Gajjar ) . అప్పుడు మోనాల్ అంతగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం అఖిల్ మరోసారి తనను నామినేట్ చేయడాన్ని మోనాల్ తట్టుకోలేకపోయింది. Also read : Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్
ఇది చూసిన మాస్టర్ 'వాడేంటి మిగతా ఫ్రెండ్స్‌ను పక్కనపెట్టి నీమీద వేశాడు' అని మోనాల్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. దానికి మోనాల్ రిప్లై ఇస్తూ.. అమ్మాయి-అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాలేరు.. ఫ్రెండ్స్ అవ్వాలి అంటే కొంచెం మోర్ కావాలి? ఆ మోర్ లేదు కదా అదే ప్రాబ్లమ్'' అంటూ ఉద్వేగానికి లోనైంది. మోనాల్‌ని చూసి జాలిపడ్డ మాస్టర్ 'నువ్వు ఉండే వరకూ నేను నీకు సపోర్ట్‌గా ఉంటా 'అని మోనాల్ చేయి పట్టుకుని ధైర్యం చెప్పాడు. నామినేషన్ ప్రక్రియతో అవినాష్ ( Comedian Avinash), అరియానా ( Anchor Ariyana ), అమ్మ రాజశేఖర్, మోనాల్ ఒక టీమ్‌గా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ అఖిల్ వెళ్లి మోనాల్‌ని ఎందుకు నామినేట్ చేశాడు? అన్నదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. Also read : Bigg Boss 4 Telugu: అవినాష్, అమ్మ రాజశేఖర్‌లపై ఫైర్ అయిన నోయల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe