Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?

ఆరోగ్య కారణాల రీత్యా నోయల్‌ ( Singer Noel Sean ) బిగ్ బాస్ హౌజ్‌‌ను వీడిన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన నోయల్ త్వరలో కోలుకుని తిరిగి బిగ్‌బాస్‌ హౌజ్‌కి వస్తాడని అతని అభిమానులు ఆశించారు. కానీ, శనివారం నాగార్జున ( Nagarjuna Akkineni ) వచ్చి.. నోయల్‌ ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ని వీడుతున్నాడని చెప్పి ఎలిమినేట్‌ అయిన అందరి కంటెస్టెంట్స్‌లాగే స్టేజ్ మీదకు పిలిచి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌పై తన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Last Updated : Nov 3, 2020, 03:54 AM IST
Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?

Noel in Bigg Boss 4 Telugu :  బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రియాలిటీ షోలో ఆరోగ్య కారణాల రీత్యా నోయల్‌ ( Singer Noel Sean ) బిగ్ బాస్ హౌజ్‌‌ను వీడిన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన సింగర్ నోయల్ త్వరలో కోలుకుని తిరిగి బిగ్‌బాస్‌ హౌజ్‌కి వస్తాడని అతని అభిమానులు ఆశించారు. కానీ, శనివారం నాగార్జున ( Nagarjuna Akkineni ) వచ్చి.. నోయల్‌ ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ని వీడుతున్నాడని చెప్పి ఎలిమినేట్‌ అయిన అందరి కంటెస్టెంట్స్‌లాగే స్టేజ్ మీదకు పిలిచి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌పై తన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సెల్ఫీ తీసుకొని నోయల్‌కి గుడ్ బాయ్ చెప్పారు నాగార్జున. Also read : Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్

సోమవారం నోయల్ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసి.. అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ చేశాడు. ‘ద గేమ్ ఈజ్ స్టిల్ ఆన్.. ఏదైనా జరగొచ్చు.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా హెల్త్ కోసం ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని చూస్తే చాలా ఎమోషనల్‌గా ఉంది. కానీ.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదైనా జరగొచ్చు.. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. పని అయిపోయింది అనుకున్నవాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది కదా? త్వరలో ఫుల్‌ డీటైల్స్ అందిస్తా మళ్లీ కలుద్దాం’ అంటూ నోయల్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Also read : Bigg Boss 4 Telugu: అవినాష్, అమ్మ రాజశేఖర్‌లపై ఫైర్ అయిన నోయల్

నోయల్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే.. అతడు తిరిగి మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లో అడుగు పెడతాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నోయల్ ఆరోగ్య కారణాలరీత్యానే బిగ్ బాస్ హౌజ్ లోంచి బయటికి వెళ్లాడే తప్ప ఎవరో ఒకరు నామినేట్ చేస్తే ఎలిమినేట్ అవలేదు కనుక అతడు రీ ఎంట్రీ ( Noel reentry in to bigg boss house ) ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నోయల్ రీ ఎంట్రీ విషయంలో బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో జంటల మధ్య టైటిల్స్ చిచ్చు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x