Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌  ఫైనల్ రోజు వచ్చేసింది. విజేత ఎవరో తెలియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో..బిగ్ బాస్(Bigg Boss) నిర్వాహకులు ఫినాలే(Bigg Boss 5 Telugu Grand Finale)కు సంబంధించి చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో ఎపిసోడ్‌కి సంబంధించిన మ్యాటర్ ఏమీ లీక్ చేయకుండా జస్ట్ నాగార్జున మాత్రమే ప్రమోషన్ కోసం వచ్చినట్టుగానే ఉంది. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా...దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఈవెంట్ కు టాలీవుడ్(Tollywood)తో బాలీవుడ్(Bollywood) సెలబ్రెటీలు కూడా రానున్ననట్లు  సమాచారం.  'బ్రహ్మాస్త్ర' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్, అలియాభట్‌(Alia bhatt)లతో రాజమౌళి(Raja Mouli) కూడా రాబోతున్నారని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ మూవీ(Shyam Singh Roy Movie) ప్రమోషన్స్ లో భాగంగా..నాని(Hero Nani), సాయిపల్లవి(Sai Pallavi), కృతి శెట్టి సందడి చేయనున్నట్లు సమాచారం. పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. 




Also Read: ​BiggBoss Telugu 5 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధుల జాబితా ఇదే


 


ఇప్పటికే విన్నర్ ఎవరనేది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. హౌస్ నుంచి ముందుగా సిరి, మానస్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మిగతా మూడు స్థానాలు కోసం సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో తెలియాలంటే..కొంత సమయం వేచి చూడాల్సిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook