BiggBoss Telugu5 : లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదా ఎంచుకుంటానన్న శ్రీరామ్.. మరి టిఫిన్‌కు ఎవరంటూ సన్నీ ఫన్నీ ప్రశ్న
Bigg Boss 5 Telugu Sreerama Chandra: శ్రీరామ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్ (housemates) అడగ్గా.. లంచ్ టీమ్‌లో సిరిని (siri) డిన్నర్ టీమ్‌లో హమీదాను (hamida) ఎంచుకుంటానని చెప్పాడు. మరి టిఫిన్‌కు ఎవరంటూ సన్నీ (sunny) ఫన్నీగా అడిగిన ప్రశ్నకు శ్రీరామ్ నవ్వాపుకోలేకపోయాడు.
Bigg Boss 5 Telugu Sreerama Chandra to choose Siri for lunch Hamida for dinner: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీరామచంద్ర (Sreerama Chandra) ప్లేబాయ్‌గా మారాడు. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి హౌజ్‌కు కొత్త కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ బిబి షో పేరుతో ఇచ్చిన టాస్క్‌లో హౌజ్‌మేట్స్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ను హౌజ్‌మేట్స్ పలు ప్రశ్నలు అడిగారు. వాటికి శ్రీరామ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్ (housemates) అడగ్గా.. లంచ్ టీమ్‌లో సిరిని (siri) డిన్నర్ టీమ్‌లో హమీదాను (hamida) ఎంచుకుంటానని చెప్పాడు. మరి టిఫిన్‌కు ఎవరంటూ సన్నీ (sunny) ఫన్నీగా అడిగిన ప్రశ్నకు శ్రీరామ్ నవ్వాపుకోలేకపోయాడు.
ఇక హౌస్‌మేట్స్‌లో కొందరు ఎలా మాట్లాడతారు.. వారు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని అనుకరించి చూపించాడు సన్నీ. ఆ సమయంలో సిరి దీన్ని పర్సనల్‌గా తీసుకోవద్దంటూ సన్నీ అనడంతో.. సోమవారం నామినేషన్స్‌లో (nominations) చూసుకుందాం అంటూ సిరి రిప్లై ఇచ్చింది.
Also Read : India's tit for tat to UK: యూకేకు బుద్ధి చెప్పిన భారత్.. వాళ్లకూ Quarantine తప్పదిక
ఇక లోబో (lobo), ప్రియాంకలు (priyanka) ఖుషి సినిమాలోని నడుమ సీన్‌లో యాక్ట్ చేసి చూపించారు. భూమికలా ప్రియాంక కస్సుమనడం.. అందుకు తగ్గట్లుగా లోబో రిప్లై ఇవ్వడం ఫన్నీగా ఉంది. అయితే ఈ వారం బెస్ట్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో నిర్ణయించే క్రమంలో బిగ్‌బాస్ (Bigg Boss) హౌజ్‌మేట్స్ మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది. మొత్తానికి ఇవ్వాల్టి ఎపిసోడ్ కాస్త ఫన్నీగా.. కాస్త సీరియస్‌గా సాగనుంది.
Also Read : Video: ట్రాఫిక్ పోలీసు కారు బోనెట్‌పై కూర్చున్నందుకు 1కి.మీ వరకు లాక్కెళ్లిన డ్రైవర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook