Bigg Boss 6 Telugu 10th Week Captaincy Task : బిగ్ బాస్ ఇంట్లో పదో వారం కెప్టెన్సీ టాస్క్ స్నేక్స్ అండ్ లాడర్స్ అంటూ ఆట ఆడించాడు. ఇందులో మట్టిని పట్టుకుని నిచ్చెనలు, పాముల బొమ్మలను గీయాల్సి ఉంటుంది. సమయానుగుణంగా ఆ మట్టిని దొంగిలించడం, తీసేయడం వంటివి కూడా చేసుకోవచ్చు. ఇలా పాముల టీంలో కొంత మంది, నిచ్చెనల టీం కొంత మందిని డివైడ్ చేశాడు బిగ్ బాస్. అయితే పాముల టీంలో కీర్తి, వాసంతి వంటి వారున్నారు. నిచ్చెనల టీంలో రాజ్, రేవంత్, సత్య వంటి వారున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక కీర్తి అయితే తన వేలికి గాయమైనా కూడా.. ఆడేందుకు చూసింది. రాజ్ నిచ్చెనలోంచి మట్టిని లాగేందుకు ప్రయత్నించింది. కానీ ఓడిపోయింది. ఇక మట్టిని ఎత్తుకునే సమయంలోనూ కీర్తికి సమస్యే ఏర్పడింది. దీంతో కీర్తి కన్నీరుమున్నీరైంది. తాను గాయం వల్ల ఆట ఆడలేకపోతోన్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. కీర్తి పరిస్థితి అలా ఉంటే.. వసంతి మాత్రం శివంగిలా రెచ్చిపోయింది.


 



సత్య అయితే వసంతి నుంచి మట్టిని లాగేందుకు ప్రయత్నించినట్టుంది. కానీ వసంతి గట్టిగా డిఫెండ్ చేసింది. ఉడుం పట్టులా  సత్యను తన కాళ్ల మధ్యలో నలిపేసింది. సత్యకు ఇక ఊపిరి ఆడలేదేమో అన్నట్టుగా చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఆట నుంచి ఇనయ, రోహిత్, వసంతిలు బయటకు వచ్చారని అంటున్నారు. లైవ్ టెలికాస్ట్‌లో ఆట మంచి రసవత్తరంగా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు.


ఈ వారం ఆట ఎవరు బాగా ఆడతారు..  ఎవరు కెప్టెన్ అవుతారు? అన్నది చూడాలి. ఇక ఈ వారం సత్య, ఫైమా, కీర్తి, శ్రీహాన్, ఇనయ ఇలా చాలా మంది డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. కానీ శ్రీహాన్, సత్యలకు నెగెటివిటీ ఎక్కువగా ఉండటంతో వారు ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయనిపిస్తోంది.


Also Read : Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్


Also Read : Samantha Yashoda movie : నా మొహం మీద కొట్టారు.. అర్థగంట అదే షాక్‌లో ఉన్నా.. సమంత కామెంట్స్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook