Bigg Boss 8 Contestants : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికీ 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదట రెండు సీజన్లోకి మంచి రేటింగ్ వచ్చినప్పటికీ తరువాత సీజన్లోకి అంతగా క్రేజ్ రాలేదు. కానీ తాజాగా జరిగిన బిగ్ బాస్ 7 కి మాత్రం విపరీతమైన హైప్ వచ్చింది. రైతు బిడ్డగా ఎంటర్ అయినా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా కప్ తీసుకెళ్లాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవన్నీ పక్కన పెడితే సీజన్ జరుగును జరుగుతున్నంత కాలం మంచి టిఆర్పిలు వచ్చాయి. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన వార్తలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. సీజన్ 8 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి 
 
ఇక బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 7 లో పాల్గొని ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయిన ముగ్గురు మాజీ కంటెస్టెంట్స్ ఇప్పుడు సీజన్ 8 లో కూడా కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. 


సీజన్ 7 కంటే బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి అని నిర్మాతలు భారీ స్థాయిలో ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బుల్లితెర, సినీ సెలబ్రిటీలను లైన్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 7 లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుని ఫైనల్స్ దాకా ఉన్న శివాజీ అమర్ దీప్ లతోపాటు విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా మళ్లీ సీజన్ 8కి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని తెలుస్తోంది. 


కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డాక్టర్ బాబు పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించిన నిరుపమ్ పరిటాల ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరించబోతున్నారు అని సమాచారం. 


నిరుపమ్ తో పాటు ఇంకా పేరు ఉన్న మరికొందరు బుల్లితెర సెలబ్రిటీలను కూడా బిగ్ బాస్ 8లో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ కూడా 8 కి వస్తే ఈ సీజన్ కూడా మంచి హిట్ అవుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.


Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..


Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి