Akhil Sarthak Injured బిగ్ బాస్ షోలో అఖిల్ చేసిన సందడి కంటే బీబీ జోడిలో అఖిల్ చేస్తోన్న పర్ఫామెన్స్‌కే జనాలు ఎక్కువగా ఎంటర్టైన్ అవుతున్నారు. బిగ్ బాస్ ఇంట్లో మూడీగా ఉండే అఖిల్.. బీబీ జోడిలో రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేస్తున్నాడు. తేజస్వీతో కలిసి అఖిల్ వేస్తోన్న రొమాంటిక్ స్టెప్పులు అందరినీ అలరిస్తున్నాయి. అయితే తాజాగా అఖిల్‌కు బీబీ జోడి షోలో గాయమైనట్టుగా కనిపిస్తోంది. కానీ అఖిల్ మాత్రం ఆ విషయాలను బయటకు రానివ్వడం లేదు. టైం వచ్చినప్పుడు వాటిని చెబుతాను అని అఖిల్ దాటవేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఖిల్ సార్థక్ ఇప్పుడు గాయాలతో హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. కడుపు మీద ఏదో దెబ్బ తగిలినట్టుగా, కట్టుకట్టినట్టుగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం క్లారిటీ రావడం లేదు. ఎంతో నొప్పి, బాధగా ఉంది కానీ ఇప్పుడు అవన్నీ చెప్పలేను.. ఇప్పటికైతే నేను కోలుకుంటున్నాను.. ఏం జరిగిందనే విషయాన్ని మీకు టైం వచ్చినప్పుడు చెబుతాను అని అఖిల్ సార్థక్ పోస్ట్ వేశాడు.


[[{"fid":"264379","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


చూస్తుంటే అది బీబీ జోడి షో షూటింగ్ జరిగినప్పుడే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ క్యాస్టూమ్స్ చూస్తే బీబీ జోడి పర్ఫామెన్స్‌లో భాగమేననిపిస్తోంది. అయితే అఖిల్ మాత్రం ఇప్పుడు ఎలాంటి విషయాలను బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఏం జరిగిందనే విషయాన్ని అఖిల్ చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే.


బిగ్ బాస్ ఇంట్లో అఖిల్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ ట్రాక్ అందరికీ తెలిసిందే. అది చివరకు మోనాల్ అఖిల్‌ ట్రాక్‌గా మారింది. మోనాల్ దృష్టిలో అభిజిత్ విలన్ అయ్యాడు. కానీ జనాల దృష్టిలో అఖిల్ విలన్ అయ్యాడు. అందుకే బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు రన్నర్‌గా నిలిచాడు. అది కూడా సోహెల్ డబ్బుతో డీల్ చేసుకోవడంతో అఖిల్‌కు రెండో ప్లేస్ వచ్చింది. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లోనూ అఖిల్ రన్నర్‌గానే నిలిచాడు.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook