Bigg Boss Arohi : నేనేదీ ఫ్రీగా చేయను.. అంత మంచితనం లేదు.. బిగ్ బాస్ ఆరోహి కామెంట్స్
Bigg Boss Arohi News బిగ్ బాస్ షోతో ఆరోహికి మంచి క్రేజ్ వచ్చింది. అయితే కాస్త నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఆరోహి, సూర్యల ట్రాక్ గురించి ఎంతగా రూమర్లు, ట్రోల్స్, మీమ్స్ పుట్టుకొచ్చాయో అందరికీ తెలిసిందే.
Arohi Rao in Bigg Boss బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లందరికీ ఒకే రకమైన ఇమేజ్ వస్తుందా? లేదా? అన్నది చెప్పలేం. కొందరికి పూర్తి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది.. ఇంకొందరికి ఫుల్ నెగెటివ్ ఇమేజ్ వస్తుంది.. మరికొందరికి పాజిటివ్, నెగటివ్ రెండు ఇమేజ్‌లు వస్తాయి. చాలా మంది మాత్రం ఎలాంటి ప్రభావం చూపించకుండా వెళ్తారు. కానీ ఆరో సీజన్‌లో వచ్చిన ఆరోహి మాత్రం తన మార్క్ వేసింది. తన మాటల్లో కాస్త కరుకుదనం చూపించినా కూడా ముక్కుసూటితనంతో మంచి ఇమేజ్ దక్కించుకుంది.
ఆరోహికి కొంత పాజిటివ్, కొంత నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. ఇక సురోహి అంటూ సూర్య, ఆరోహి ట్రాక్‌ను జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. వారిద్దరి మీద వచ్చిన మీమ్స్, ట్రోల్స్ అందరికీ తెలిసిందే. టీఆర్పీ రేటింగ్‌ల కోసం బిగ్ బాస్ టీం చేసే జిమ్మిక్కులు అందరికీ తెలిసిందే. ఏ ఇద్దరి మధ్య ట్రాక్ సెట్ చేద్దామా? లవ్ స్టోరీని అల్లేద్దామా? అని చూస్తుంటారు. అలా మొదట్లో సురోహి ట్రాక్ మీద పడ్డారు. ఆరోహి ఎలిమినేట్ అయిన తరువాత ఇనయ సూర్య ట్రాక్ మీద పడింది బిగ్ బాస్ టీం.
సూర్య, ఆరోహి టాస్కులో ఉంటే బీబీ టీం మాత్రం ఆ ఇద్దరి రొమాంటిక్ యాంగిల్‌ను క్యాప్చర్ చేసే పనిలో పడింది. ఆ ఫోటోను నాగార్జున స్టేజ్ మీద చూపించి మరీ రచ్చ చేశాడు. అలా సూర్య, ఆరోహి ఫ్రెండ్ షిప్ కాస్త లవ్ ట్రాక్‌గా మార్చేశారు. ఆరోహి బయటకు వచ్చాక ఇంత వరకు మళ్లీ ఆ టాపిక్‌ను ఎత్తింది కూడా లేదు. సూర్య, ఆరోహి ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. ఇక బీబీ జోడి షోకు కూడా ఆరోహి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
[[{"fid":"262798","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో క్రేజ్ రావడం, వాటితో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఇతర సంస్థలతో కొలాబరేట్ అవ్వడం, ప్రమోషన్స్ చేయడం, వాటి ద్వారా డబ్బులు సంపాదించడం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇదే రకంగా ఆరోహి కూడా సంపాదించేస్తోంది. కానీ కొంత మంది మాత్రం ఫ్రీగా చేయమని అడుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇదే విషయంలో మీద ఆరోహి స్పందించింది. తానేమీ ఉచితంగా చేయనని, అంత మంచితనం గానీ, అంత ఇంట్రెస్ట్ గానీ తనకు లేదని నిర్మొహమాటంగా చెప్పేసింది. మరి ఇది చూసి అయినా ఆరోహిని వారు అలా ఉచితానికి అప్రోచ్ అవ్వకుండా ఉంటారేమో.
Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook