Punarnavi Engaged To Udbhav Raghunandan: పునర్నవికి కాబోయే భర్త ఇతడే.. ఫొటో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
Punarnavi Engaged To Udbhav Raghunandan: టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తన చేతి వేలికి ఉంగరాన్ని చూపించి మొదటగా తన అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి లోను చేశారు. కానీ పునర్నవి ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని గమనిస్తే అప్పటివరకూ బిగ్‌బాస్ బ్యూటీ ఆగేలా కనిపించడం లేదు.
బిగ్‌బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తన చేతి వేలికి ఉంగరాన్ని చూపించి మొదటగా తన అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యానికి లోను చేశారు. ఆపై ఓ స్నేహితురాలు అసలు విషయం ఏంటి.. నిజంగానే మ్యాటర్ ఉందా.. నమ్మవచ్చా అని టాలీవుడ్ నటి పునర్నవిని అడిగింది. అక్టోబర్ 30 వరకు వేచి చూడు అని బదులిచ్చింది. కానీ పునర్నవి ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని గమనిస్తే అప్పటివరకూ బిగ్‌బాస్ బ్యూటీ ఆగేలా కనిపించడం లేదు.
తనకు కాబోయే భర్త ఫొటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది పునర్నవి. అయితే పనిలో పనిగా అతడు ఎవరో తెలుసుకునేలా అతడి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని ట్యాగ్ చేసింది. దీంతో పునర్నవి ఏం చెప్పాలనుకుంటుంది, ఎవరి గురించి చెప్పనుందో నెటిజన్లు పసిగట్టేశారు. పునర్నవి చేతికి ఉన్నది నిశ్చితార్థపు ఉంగరమేనని (Punarnavi Engaged To Udbhav Raghunandan) అని నెటిజన్లు ఇప్పుడు నమ్ముతున్నారు.
ఉద్భవ్ రఘునందన్ (Udbhav Raghunandan) అనే నటుడుతో పునర్నవి ప్రేమలో పడిందని తెలుస్తోంది. ఉద్భవ్ రచయిత, ఫిల్మ్ మేకర్ కూడా అని ప్రొఫైల్ చూస్తే అర్థమవుతోంది. ఉద్భవ్ రఘునందన్ ప్రపోజ్ చేయగా నటి పునర్నవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు రేపు చెబుతానంటూ మరో పోస్ట్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe