Bigg Boss Samrat New Home బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌గా సామ్రాట్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కాంట్రవర్సీలకు దూరంగా, నెగెటివ్ ఇమేజ్‌ లేకుండా సామ్రాట్ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సుతిమెత్తని మనస్తత్వం, మంచితనం ఉన్న వ్యక్తిగానే సామ్రాట్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. కానీ చివర్లో గీతా మాధురి, సామ్రాట్ మధ్య పిచ్చి ట్రాక్ నడిపించాలని బిగ్ బాస్ టీం చూసినట్టుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేజస్వీ సైతం సామ్రాట్ మీద మనసు పారేసుకున్నట్టుగా కనిపించేది. మొత్తానికి బిగ్ బాస్ ఇంటి నుంచి మాత్రం సామ్రాట్ మంచి ఇమేజ్‌తో బయటకు వచ్చాడు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీగానే నిలిచింది. అతని మొదటి భార్య విడాకుల వ్యవహారం, పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఇలా అంతా కూడా సామ్రాట్ ఇమేజ్‌ను కాస్త దెబ్బ తీశాయి.


 



కానీ సామ్రాట్ ఇవేమీ పట్టించుకోలేదు. కరోనా సమయంలో మళ్లీరెండో పెళ్లి చేసుకున్నాడు. శ్రీలిఖితను సామ్రాట్ పెళ్లి చేసుకున్నాక మరింత సంతోషంగా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరిది ప్రేమ వివాహామే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సామ్రాట్, శ్రీ లిఖితలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు.


సామ్రాట్ తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. తన భార్య శ్రీలిఖితతో కలిసి ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేశాడు. ఈ మేరకు సామ్రాట్ షేర్ చేసిన పోస్ట్, వదిలిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొత్త ఇళ్లు, కొత్త కలలు, కొత్త మెమోరీస్, మా ఇంట్లోకి స్వాగతం అంటూ పోస్ట్ చేశాడు. దీనికి దీప్తి సునయన స్పందిస్తూ.. వస్తున్నా అని చెప్పేసింది. కొత్త ఆరంభం, మా స్వీట్ హోం అంటూ సామ్రాట్ హ్యాష్ ట్యాగులు పెట్టేశాడు. ఈ మధ్యే సామ్రాట్ ఓ కొత్త కారు కూడా కొన్నాడన్న విషయం విదితమే


Also Read : Kasthuri Shankar Drinking Habit : మందు తాగను, స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా పెట్టను : కస్తూరీ శంకర్


Also Read : Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook