Bigg Boss 7 Winner Prize Money: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 విన్నర్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అయితే సోషల్ మీడియాలో రైతు బిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విజేతగా నిలిచనట్లు జోరుగా ప్రచారం జరుగోతోంది. మరోవైపు సీరియల్ హీరో అమ‌ర్‌దీప్ రన్నర్ గా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ట్రోఫీ గెలుస్తాడనుకున్న శివాజీ మూడో ప్లేస్ కు పరిమితమైనట్లు తెలుస్తోంది. మరో ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ మాత్రం బిగ్ బాస్ టీమ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకుని ఫినాలే రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఫినాలేలో అడుగుపెట్టిన టాప్-6 కంటెస్టెంట్లలో ముందుగా అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడని.. ఆ తర్వాత ప్రియాంక జైన్ ను ఎలిమినేషన్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ఎలిమినేషన్ ను రవితేజ ప్రకటించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఈసారి బిగ్ బాస్ ప్రైజ్‌మ‌నీ ఎంత ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న. అయితే విజేతకు యాభై ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నిని ఇవ్వబోతున్నట్లు నాగార్జున ఇది వరకే ప్రకటించారు. అయితే దీంతోపాటు బిగ్‌బాస్ షోకు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఓ జ్యూవెల్ల‌రీ సంస్థ విన్న‌ర్‌కు 20 లక్షల విలువచేసే డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా అందించనుందట. అంతేకాకుండా విజేతకు 12 ల‌క్ష‌ల విలువైన మారుతి బ్రిజా కారు కూడా గిప్ట్ గా ఇవ్వనుంది బిగ్ బాస్ టీమ్. మెుత్తానికి గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ విన్నర్ 80 లక్షలు వరకు ప్రైజ్‌మ‌నీ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆదివారం జరగబోయే ఫినాలే ఎపిసోడ్ కు మాస్ మహారాజా రవితేజతోపాటు బ‌బుల్‌గ‌మ్, డెవిల్‌, నా సామిరంగ మూవీ టీమ్‌లు సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే విన్నర్ ను ఈసారి కూడా నాగార్జునే ప్రకటించనున్నారట.


Also Read: Bigg Boss 7 Winner: బిగ్ బాస్ విన్నర్ ఇతనే.. లీక్ చేసిన సందీప్ మాస్టర్ భార్య


Also Read: Ariyana Bikini Show: బికినీ బాంబ్ పేల్చిన అరియానా.. ఫస్ట్ టైం అలా చూసి షాక్ లో నెటిజన్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook