Bigg Boss 7 Winner: బిగ్ బాస్ విన్నర్ ఇతనే.. లీక్ చేసిన సందీప్ మాస్టర్ భార్య

Bigg Boss Season 7 : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈరోజు సాయంత్రం టెలికాస్ట్ అవ్వనున్న ఈ ఎపిసోడ్ లో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియజేయనున్నారు హొస్ట్ నాగార్జున. ఈ నేపథ్యంలో ఈ సీజన్ విన్నర్ ఎవరో సందీప్ మాస్టర్ భార్య ఇన్ డైరెక్ట్ గా లీక్ చేసేసింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 10:39 AM IST
Bigg Boss 7 Winner: బిగ్ బాస్ విన్నర్ ఇతనే.. లీక్ చేసిన సందీప్ మాస్టర్ భార్య

Bigg Boss Season Finale: బిగ్ బాస్ సీజన్ సెవెన్ 100 ఎపిసోడ్ లకు పైగా పూర్తి చేసుకుని ఫైనల్ గా గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అయిపోయింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పరవాలేదు అనిపించుకుంది. 105 రోజులు పాటు  ఎన్నో ఉల్టా పుల్టా ట్విస్టులతో సాగిన ఈ సీజన్ దేశంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా హయ్యెస్ట్ రేటింగ్ తెచ్చుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

కాగా ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకున్న బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు ఫైనలిస్ట్‌లు ఉన్నారు. అయితే ఎవరు ఏ స్థానంలో ఎలిమినేట్ కాబోతున్నారో లీక్‌లు ముందే బయటకు వచ్చేశాయి. నిన్న ఉదయం నుంచి విన్నర్ ఎవరు ఏ పొజిషన్లో ఎవరు నిలబడపోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. 

కాగా  6,5,4, 3 స్థానాలకు సంబంధించిన షూటింగ్ శనివారం నాడే పూర్తి కావడంతో.. ఈ స్థానాల గురించి పూర్తి వివరాలు నిన్ననే చాలావరకు బయటకి వచ్చేసాయి. అర్జున్ ఆరోస్థానం.. ప్రియాంక ఐదో స్థానం లో.. యావర్ నాలుగో స్థానం లో.. శివాజీ మూడో స్థానం‌లో లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం.. అంతేకాదు యావర్.. రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకుని రావడం విశేషం. ఇక విన్నర్ రేస్‌లో ప్రశాంత్-అమర్ దీప్‌లు పోటీ పడుతున్నారు. 

ఇక విన్నర్‌కి సంబంధించిన షూటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోయినా ఇప్పటికీ బయట ఉన్న బజ్.. ఫ్యాన్స్ బేస్‌.. ఆడియన్స్ అభిప్రాయాన్ని బట్టి.. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడం ఖాయంగా అనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్‌కి ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ అనేకమంది పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ సమయంలో ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్ ఆట సందీప్ భార్య పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ‘భయపడాల్సిన పనిలేదు.. అంతా ‘ప్రశాంతం’గా ఉండండి.. ‘ అంటూ ప్రశాంతే విన్నర్ అన్నట్టుగా ముందే హింట్ ఇచ్చింది సందీప్ మాస్టర్ భార్య జ్యోతిరాజ్. 

‘హార్డ్ వర్క్ నెవర్ ఫైల్స్.. గాడ్ బ్లెస్ యు తమ్ముడు’ అంటూ స్టేటస్ కూడా పెట్టేసింది.. ఇక ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ భార్య పోస్ట్ పెట్టడంతో వినర్ ని 100% ఫిక్స్ అయిపోయారు అందరూ. 

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News