Bigg Boss 8 Telugu Elimination: రోజులు గడిచే కొద్ది.. ఆసక్తికరమైన టాస్క్ లతో.. ఇంటి సభ్యుల మధ్య గొడవలతో.. మరికొందరి కంటెస్టెంట్ల స్ట్రాటజీలతో.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవ తరంగా మారుతోంది. బిగ్ బాస్ మొదలైన మొదటి వారమే అతి తక్కువ ఓట్లు వచ్చిన బెజవాడ బేబక్క.. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రెండవ వారం కూడా త్వరలో పూర్తి కాబోతోంది. ఇవాళ అంటే శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవబోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ ఎవరు అని.. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది. ఎలిమినేషన్ కంటే ముందు అసలు నామినేటెడ్ కంటెస్టెంట్లు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శేఖర్ భాష, పృధ్వీరాజ్, నిఖిల్, ఆదిత్య, నాగ మణికంఠ, నైనిక, సీత, విష్ణు ప్రియ. 


అభిమానులు, ఫాలోవర్లు ఇప్పటికే ఆన్‌లైన్ పోల్స్‌లో పాల్గొని, తమ అభిమాన హౌస్ మేట్స్ కి ఓట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోల్స్ ఫలితాల ప్రకారం, నిఖిల్, విష్ణు ప్రియకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. వీరి ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఈ వారానికి వారు సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది.


ఇక ఆదిత్య, శేఖర్ బాష అయితే తక్కువ ఓట్లు సాదించడం వల్ల ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. అందరి అంచనాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ట్రెండ్ చూసి.. ఈ వారం ఎలిమినేషన్‌ కోసం ఎక్కువ ప్రమాదంలో ఉన్నవారు.. శేఖర్ బాషా అని చెప్పవచ్చు. సీత కి కూడా ఓట్స్ తక్కువగానే ఉన్నాయి. సీత, శేఖర్ భాషా ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంది అని సమాచారం. అయితే శేఖర్ భాషా జోక్స్ ఇంస్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న సమయంలో.. ఈవారం సీతనే ఆటలోంచి వెళ్లిపోవచ్చు అని అంచనాలు వేస్తున్నారు అందరు.


ఇక ఎప్పటిలాగే చివరి నిర్ణయం ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. బిగ్ బాస్ షో నిర్వాహకుల నిర్ణయాలతో కలిపి.. ఈ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అంత ఈజీ కాదు. ఈ వారాంతానికి ఎవరు ఎలిమినేట్ అవుతారో.. అన్న సస్పెన్స్ మాత్రం.. ఆదివారం రాత్రి దాకా ఉండటం ఖాయం.


Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.