Bigg Boss Shiva Jyothi : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన శివ జ్యోతి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి

Bigg Boss Shiva Jyothi New Home బిగ్ బాస్ శివ జ్యోతి కొత్తింట్లోకి అడుగు పెట్టేసింది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా కూడా హాజరయ్యారు. రోహిణి, హిమజ, దీప్తి సునయన ఇలా అందరూ కలిసి సందడి చేశారు.
Bigg Boss Shiva Jyothi New Home బిగ్ బాస్ మూడో సీజన్లో శివ జ్యోతి తన ముద్ర వేసింది. ఎప్పుడూ ఏడుపు గొట్టు మొహంతో కనిపించి పాతాళ గంగా అనే పేరు తెచ్చుకుంది. ప్రతీ చిన్నదానికి పెద్ద శోకాలు పెట్టేసింది. ఎవరైనా తనకు నచ్చిన వారు ఎలిమినేట్ అయితే చాలు.. చనిపోయినప్పుడు ఎలా ఏడుస్తారో అలా ఏడ్చేసి నానా హంగామా చేసేది. బిగ్ బాస్ ఇంట్లో శివ జ్యోతి ఎమోషనల్ పర్సన్‌గానే ముద్ర వేసుకుంది. తనకంటూ ఇంకా ఏమీ గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.
బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందు వీ6 చానెల్లో తీన్మార్ వార్తలు చెబుతూ ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక.. టీవీ9లో ఇస్మార్ట్ వార్తలు చెప్పుకుంటోంది. ఇక అదనంగా అంటే.. బుల్లితెరపై జరిగే పండుగ ఈవెంట్లు చేస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జెమిని, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బుల్లితెరపై శివ జ్యోతికి మంచి డిమాండ్ ఉంది. తన భర్త గంగూలితో కలిసి శివ జ్యోతి ప్రోగ్రాంలు చేస్తోంది.
ఇప్పటికే శివజ్యోతి కార్ల మీద కార్లు మార్చేస్తోంది. ఆల్రెడీ శివజ్యోతి ఇది వరకు అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ కొనేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది ఆ మధ్య. అయితే ఇప్పుడు మరోసారి శివజ్యోతి కొత్తింటిని కొనేసినట్టు కనిపిస్తోంది. నిన్న ఆ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుక జరిగినట్టు తెలుస్తోంది.
శివ జ్యోతి కొత్తింట్లోకి వెళ్లిన సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు సందడి చేశారు. దీప్తి సునయన, రోహిణి, హిమజ, శివ కృష్ణ వంటివారు ఈ కార్యక్రమానికి వచ్చి హంగామా చేశారు. ప్రస్తుతం రోహిణి పెట్టిన ముద్దులు, శివజ్యోతి పెట్టిన ముద్దులు వైరల్ అవుతూనే ఉన్నాయి. శివజ్యోతి కొత్తింట్లోకి వెళ్లడంతో నెటిజన్లు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు. పాత ఇంటి గురించిప్రశ్నలు వేస్తున్నారు.
Also Read : Jagapathi Babu : అరవై ఏళ్లకు నేర్చుకున్నాడట.. రమ్ము, విస్కీ అంతా అదేనట.. వంటగదిలో జగ్గూ భాయ్
Also Read : Venkatesh Daughter Ashritha : మరదలితో నాగ చైతన్య సందడి.. వెంకీ మామ కూతురి పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook