Venkatesh Daughter Ashritha : మరదలితో నాగ చైతన్య సందడి.. వెంకీ మామ కూతురి పోస్ట్ వైరల్

Naga Chaitanya With Venkatesh Daughter నాగ చైతన్య తాజాగా తన మరదలితో కలిసి కనిపించాడు. ఆశ్రిత, నాగ చైతన్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 11:53 AM IST
  • వెంకీమామ కూతురి సందడి
  • నాగ చైతన్య ఆశ్రిత హల్చల్
  • బావా అంటూ ప్రేమగా పిలిచిన ఆశ్రిత
Venkatesh Daughter Ashritha : మరదలితో నాగ చైతన్య సందడి.. వెంకీ మామ కూతురి పోస్ట్ వైరల్

Naga Chaitanya With Venkatesh Daughter : నాగ చైతన్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. నాగ చైతన్య ఎప్పుడో ఓసారి తన సినిమాల గురించి మాత్రమే ట్వీట్లు గానీ పోస్టులు గానీ చేస్తుంటాడు. ఇక తాజాగా తన మరదలి కోసం ఇలా బయటకు వచ్చాడు. వెంకీమామ కూతురు ఆశ్రిత విదేశాల్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆమె హైద్రాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకో రెండు నెలలు ఇక్కడే ఉంటుందట. ఈ క్రమంలో నాగ చైతన్యతో కలిసి సందడి చేసింది.

నాగ చైతన్యకు హోటల్ బిజినెస్ కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తన ఫ్రెండ్స్‌తో కలిసి నాగ చైతన్య దీన్ని ప్లాన్ చేశాడు. శోయు అనే వంటకాన్ని స్పెషల్‌గా డిజైన్ చేశారట. తనకు జపనీస్ ఫుడ్ అంటే ఇష్టమని, పాన్ ఆసియా ఫుడ్‌ లవర్లకు జపనీస్ ఫుడ్ టేస్ట్ కూడా చూపించాలని చై అనుకున్నాడట. అందరూ శోయు వంటకం గురించి మాట్లాడుతున్నారని, దాని సంగతేంటో చూసేందుకు వచ్చానంటూ వెంకీ మామ కూతురు ఆశ్రిత చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియోలో చైని బావా అని ఆశ్రిత పిలిచిన పిలుపు చూసి అందరూ ఫిదా అయ్యారు. బావా అంటూ ఎంత ప్రేమగా పిలిచింది? అని జనాలు అనుకుంటున్నారు. ఎంతైనా ఫ్యామిలీ ఫ్యామిలీయే అని జనాలు అనుకుంటున్నారు. వెంకీమామ కూతురు, నాగ చైతన్య జోడి ఎంత చక్కగా ఉన్నారో అనుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను సమంత చూస్తే ఫీలవుతుందేమో అని జనాలు కౌంటర్లు వేస్తున్నారు.

ఆ మధ్య నాగ చైతన్య రెండో పెళ్లి మీద కూడా రూమర్లు వచ్చాయి. వెంకీమామ చిన్న కూతురిని నాగ చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయబోతోన్నారంటూ రూమర్లు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు ఇలా మరదలితో నాగ చైతన్య కనిపించడంతో అక్కినేని, దగ్గుబాటి అభిమానులు సంబరపడిపోతోన్నారు.

నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ డిజాస్టర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాను చేస్తున్నాడు. చైతన్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read : Bandla Ganesh : పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ అసంతృప్తి.. నిర్మాతగా సినిమా చాన్స్ ఇవ్వకపోవడంతో ట్వీట్ వేశాడా?

Also Read : Renu Desai Birthday : రేణూ దేశాయ్ బర్త్ డే.. కనిపించిన అకిరా నందన్.. క్లారిటీ ఇచ్చేసిందోచ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x