Bigg Boss Sohel with Akash Puri బిగ్ బాస్ నాలుగో సీజన్‌తో ఫేమస్ అయ్యాడు సోహెల్. కోపంతో ఎంత ఊగిపోయినా.. ఎంటర్టైన్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. అయితే చివరి వారంలో తన ఫ్రెండ్ మెహబూబ్ ఇచ్చిన హింట్‌తో తాను ఎలాగూ విన్నర్ కాలేనని తెలుసుకున్న సోహెల్.. డబ్బుల సూట్ కేస్ పట్టుకుని బయటకు వచ్చాడు. అలా ఇరవై ఐదు లక్షలు సొంతం చేసుకున్నాడు. మామూలుగా అయితే రన్నర్ అవ్వాల్సిన సోహెల్ మూడో స్థానంలోకి వచ్చాడు. ఇక విన్నర్ అయిన అభిజిత్‌కు సైతం ఇరవై ఐదు లక్షలే వచ్చాయి. మధ్యలో అఖిల్ బక్రా అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోహెల్‌కు బిగ్ బాస్ తరువాత సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. వరుస పెట్టి నాలుగైదు సినిమాలు స్టార్ట్ చేశాడు. కానీ ఇంత వరకు ఏ ఒక్క సినిమా రిలీజ్ అయింది లేదు. అన్నీ ప్రచార ఆర్భాటాలే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. లక్కీ లక్ష్మణ్, బూట్ కట్ బాలరాజు అంటూ ఇలా చాలా సినిమాలే లైన్లో పెట్టాడు.కానీ ఇందులో ఏ ఒక్కటైనా సక్సెస్ అవుతుందా? అన్నది అనుమానంగానే ఉంది.


 



ఇప్పుడు సోహెల్ తన ఇన్ స్టాగ్రాంలో ఆకాశ్ పూరి మీద చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆకాష్‌ పూరిని, పవిత్రను రీసెంట్‌గా కలిశాడు. మాట్లాడుతూ ఉండగానే ఎంతో క్లోజ్ అయ్యాడట. పూరి జగన్నాథ్ కొడుకుని అనే కించిత్ గర్వం కూడా చూపించలేదని, ఎంతో చక్కగా మాట్లాడడని, ఒదిగే ఉన్నాడంటూ ఆకాష్‌ మీద ప్రశంసలు కురిపించాడు. ఆకాష్‌ను ఇంత చక్కగా పెంచారంటూ పూరి జగన్నాథ్ పెంపకం గురించి కామెంట్ చేశాడు.


ఇక ఆకాష్‌ రూపంలో తనకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడంటూ సోహెల్ పోస్ట్ వేశాడు. ఆకాశ్‌తో మాట్లాడిన ఈ కొద్ది సమయంలో ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. మొత్తానికి సోహెల్ వేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆకాష్ పూరి ఆ మధ్య రొమాంటిక్ అనే సినిమాతో వచ్చాడు. ఆ తరువాత చోర్ బజార్ అంటూ వచ్చాడు, కానీ ఈ రెండు సినిమాలు దారుణంగా బెడిసి కొట్టేశాయి.


Also Read : Sekhar Master : ఢీ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. స్టేజ్‌కు దండం పెడుతూ ఎమోషనల్


Also Read : Saawariya Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూశా.. ఆ అదృష్టం నాకే దక్కింది.. లేడీ అసిస్టెంట్ డైరెక్టర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook