Bigg Boss Telugu 4 Grand Finale Rating: బిగ్‌బాస్ 4 గ్రాండ్ ఫినాలే రేటింగ్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది.
Bigg Boss Telugu 4 Grand Finale Rating: రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఇటీవల విజయవంతంగా ముగిసింది. మరో విశేషం ఏంటంటే ఈ ఏడాది జరిగిన గ్రాండ్ ఫినాలేకు అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో 21.7 శాతం రేటింగ్ సంపాదించిందని బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ అక్కినేని నాగార్జున వెల్లడించారు.
భారతదేశంలో ఈ ఏడాది ప్రసారమైన అన్ని ప్రోగ్రామ్స్, షోల కన్నా అత్యధిక రేటింగ్ పొందిన షోగా బిగ్ బాస్ తెలుగు 4(Bigg Boss Telugu 4) నిలిచింది. ఈ విజయాన్ని కింగ్ నాగార్జున ఆస్వాదిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద రియాలిటీ షోగా తెలుగు రియాలిటీ షో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు. 21.7 టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకుందని బిగ్‌బాస్ 4 హోస్ట్ వెల్లడించారు.
Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్
ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో షోలు, ప్రోగ్రామ్‌లు వాయిదా పడ్డాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సైతం కాస్త వాయిదా పడినా, అభిమానుల కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమైంది. ఏ ఆటకం లేకుండా, కరోనా మహమ్మారిని అంటుకోకుండా విజయవంతంగా 100 రోజులకు పైగా షో నిర్వహించారు. తాజాగా కంటెస్టెంట్స్, ఆడియెన్స్, చిరంజీవి, స్టార్ మాకు ధన్యవాదాలు తెలుపుతూ నాగార్జున(Nagarjuna Akkineni) ట్వీట్ చేశారు.
Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?
కాగా, బిగ్ బాస్ తెలుగు 4 టైటిల్ విజేతగా Tollywood నటుడు అభిజిత్ నిలిచాడు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. సోహైల్ మూడో స్థానంలో నిలిచినా తెలివిగా వ్యవహరించి రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్ తీసుకుని బిగ్ బాస్ 4 హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అరియానా, దేత్తడి హారిక 4,5 స్థానాల్లో నిలిచారని తెలిసిందే.
Also Read: Bigg Boss Telugu Sohel: సినిమా ఛాన్స్ కొట్టేసిన సోహైల్.. బిగ్‌బాస్ ఫేమ్ కథ వేరేనే ఉంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook