తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ). బిగ్ బాస్ సీజన్ 4, సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతుంది. ఇదే విషయమై తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులు ఓ ప్రోమో విడుదల చేశారు. Also read : ఓటిటిలో విడుదల కానున్న Anchor Sreemukhi సినిమా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించిన హీరో Akkineni Nagarjuna తిరిగి Bigg boss Telugu season 4 కి హోస్ట్‌గా రానున్నారు. ముందు సీజన్స్ లాగే ఈ సీజన్‌లో కూడా బిగ్ బాస్ టీం సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా రంగాల నుండి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ ( List of Bigg boss Telugu 4 contestants ) కూడా గోప్యంగానే ఉంచింది. Also read : Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు


కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరినీ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా బిగ్ బాస్ నిర్వాహకులు కోరినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జూన్ నెలలోనే మొదలు కావలసిన ఈ షో కరోనా కారణంగా సెప్టెంబరుకి వాయిదా పడిన విషయం తెలిసిందే. Also read : Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు