Bigg Boss 4: జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్టులకు ఆ ఒక్క ఛాన్స్ ?

బిగ్ బాస్ 4వ సీజన్ ( Bigg Boss 4) ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేకపోవడంతో ఈసారి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ఏ రోజుకు ఆ రోజు కొన్ని కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి.

Last Updated : Aug 25, 2020, 01:38 PM IST
  • బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్స్ జాబితాపై రోజుకొక రకమైన రూమర్లు.
  • తాజాగా జబర్దస్త్ నుండి ఇద్దరు ఆర్టిస్ట్స్‌ బిగ్ బాస్ 4 హౌజ్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నట్టు టాక్.
  • ఇంతకీ ఎవరా ఇద్దరు ?
Bigg Boss 4: జబర్ధస్త్ ఫేమ్ ఆర్టిస్టులకు ఆ ఒక్క ఛాన్స్ ?

బిగ్ బాస్ 4వ సీజన్ ( Bigg Boss 4) ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు లేకపోవడంతో ఈసారి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ఏ రోజుకు ఆ రోజు కొన్ని కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. అక్కినేని నాగార్జున ( Nagarjuna akkineni ) హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోలో 15 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొనబోతున్నారనే సంగతి అందరికీ తెలుసు కానీ.. ఆ పదిహేను మంది ఎవరనే క్లారిటీ మాత్రం షో స్టార్ట్ అయ్యేవరకు వచ్చే ఛాన్స్ లేదు. వాస్తవానికి జూన్ చివరి వారంలోనే ప్రారంభం కావలసిన ఈ షో కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. Also read this : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

లాక్‌డౌన్ అనంతరం కొవిడ్-19 మార్గదర్శకాలలో భాగంగా షూటింగ్స్‌కి మినహాయింపు లభించడంతో బిగ్ బాస్ నిర్వాహకులు షో నిర్వహించేందుకు ముందడుగు వేసి జూలై 20న బిగ్ బాస్ 4వ సీజన్ లోగోను ఆవిష్కరించారు. ఇటీవలే బిగ్ బాస్ 4 టీజర్‌ని ( Bigg Boss 4 teaser ) కూడా లాంచ్ చేశారు. Also read this : Bigg Boss- 4: ఎంట్రీపై ముందే క్లారిటీ ఇచ్చిన నందు

బిగ్ బాస్ 4 షోలో కంటెస్టెంట్స్ ( Bigg Boss 4 Telugu contestants ) జాబితా విషయంలో నిర్వాహకులు ఎప్పటిలాగే చాలా గోప్యత పాటిస్తున్నారు. దీంతో ఆ 15 మంది జాబితాలో ఎవరెవరు ఉన్నారా అనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో అంతే వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ ప్రకారం జబర్దస్ కామెడి షోతో ఫేమస్ అయిన ఇద్దరు స్టాండప్ కమెడియన్స్‌కి కూడా ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు జబర్థస్త్ ఫేమ్ ఆటో రామ్‌ప్రసాద్ ( Jabardasth Auto Ram Prasad ) కాగా, మరొకరు ముక్కు అవినాష్ ( Mukku Avinash ) అని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. రియాలిటీ షోలో కామెడి పండించేందుకే నిర్వాహకులు ఈ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్టు టాక్. ఇందులో ఎంతమేరకు నిజం ఉందనే విషయం మాత్రం షో ప్రారంభమైతే కానీ తెలిసే ఛాన్స్ లేదు. Also read this : Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x