Bigg Boss Telugu 7 :గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ బిగ్‌ బాస్ తెలుగు లో పరవాలేదు అనిపించుకుంటుంది. గత సీజన్ లో టిఆర్పి మరీ తగ్గిపోగా ఈసారి ఏడవ సీజన్ టిఆర్పి మరి ఎక్కువ రాకుండా అలా అని మరీ తక్కువ కాకుండా అలా సాగిపోతుంది. ఇక ప్రస్తుతం ఈ వారం కూడా సోమవారం నామినేషన్ తో హాట్ హాట్ గా మొదలైంది ఈ గేమ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం, ఆదివారం నాగార్జున దీపావళి సంబరాలు జరపగా.. సోమవారం మళ్లీ అసలైన ఆట మొదలైపోయింది. కాగా ఈ వారం నామినేషన్ ఏకంగా రెండు రోజులు ముందుగా సోమవారం బిగ్ బాస్ షో కి ది ఇచ్చిన రతిక.. ప్రియాంక, శోభాశెట్టి లని నామినేట్ చేసింది. ఇక తన తరువాత అర్జున్ కూడా శోభాశెట్టిని.. ఇక ప్రశాంతిని నామినేట్ చేశాడు. గౌతమ్.. అమర్ దీప్, అర్జున్లను నామినేట్ చేశాడు.  ఆ తర్వాత ప్రియాంక ఛాన్స్ రాగా .. తాను. రతిక, అశ్వినిలని నామినేట్ చేసింది. అయితే సోమవారం మొత్తం కేవలం ఈ నాలుగు నామినేషన్ నే జరిగాయి. ముఖ్యంగా ఆరోజు రతిక తెగ అరిచి గొడవ పెట్టడంతో…ఆ ఎపిసోడ్ అంతా దాదాపు ఆమె గొడవ తోనే సాగింది.


సోమవారం హోరాహోరీగా నామినేషన్ జరిగిన తర్వాత మళ్లీ మిగతా నామినేషన్లు మంగళవారం మొదలయ్యాయి. మంగళవారం ముందుగా బిగ్ బాస్ రైతుబిడ్డ ప్రశాంత్ కి ఛాన్స్ ఇవ్వగా ఆయన అర్జున్, రతికలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అశ్విని ని తన నామినేషన్స్ ఎవరు అని అడగగా.. ప్రియాంక, అమర్ దీప్ లను నామినేట్ చేసింది. ఇక శోభాశెట్టి.. యావర్, అశ్వినిలను నామినేట్ చెయ్యగా మరోపక్క ప్రిన్స్ యావర్.. శోభాశెట్టి, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. 


కాగా ఫైనల్ ఛాన్స్ అమర్ దీప్ శివాజీ కి వెళ్ళింది. ఇక అప్పుడు అమర్ దీప్.. గౌతమ్, యావర్ లను నామినేట్ చేశాడు. మరోపక్క శివాజీ.. గౌతమ్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. అయితే సోమవారం రతిక ఎంత హైలెట్ అయ్యిందో మంగళవారం అమర్ దీప్, యావర్ ఫైట్ అంత హైలెట్ అయింది. నామినేషన్ లో భాగంగా వీరిద్దరూ ఒకరి పైన ఒకరు ఫైర్ అయి అరుచుకుంటూ దాదాపు కొట్టుకునేదాకా వెళ్లారు. ఒక ఫైనల్ గా వీళ్ళిద్దరి గొడవని శివాజీ వచ్చి మధ్యలో ఆపాడు. ఆ తర్వాత అర్జున్ – యావర్ కూడా కాసేపు గొడవ వేసుకున్నా.


ఇలా హోరాహోరీగా కాగిన ఈ నామినేషన్ లో మొత్తం పైన ఈ వారం శోభాశెట్టి, ప్రియాంక, అశ్విని,గౌతమ్, అమర్ దీప్, అర్జున్, రతిక, యావర్ లు నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలి అంటే మాత్రం ఈ వీకెండ్ నాగార్జున వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!


Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook