Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న 12 మంది కంటెస్టెంట్స్ వీరే..!
Bigg Boss Wild Card Contestants: బిగ్‌బాస్ ఎనిమిదవ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని బిగ్ బాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు అంటూ చెప్పగా కానీ ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రముఖ యూట్యూబ్ వెల్లడించారు.
Bigg Boss Wild Card Entry: బిగ్ బ్రదర్ పేరిట పాశ్చాత్య దేశంలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో బిగ్ బాస్ పేరిట ఇండియన్ ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేసింది.అలా హిందీలో మొదలైన ఈ షో ఇప్పుడు ఏకంగా 18వ సీజన్ కి చేరుకుంది అని చెప్పవచ్చు. ఇక తెలుగులో ఏడు సీజన్లు పూర్తికాగా ఒక ఓటిటీ వర్షన్ కూడా పూర్తయింది. ఎట్టకేలకు తెలుగులో ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.
మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయింది. మరి నాలుగు వారాల్లో భాగంగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అలా మొదటివారం బెజవాడ బేబక్క, రెండవ వారం ఆర్జే శేఖర్ బాషా, మూడవ వారం అభయ్ నవీన్ , నాల్గవ వారం సోనియా ఇలా మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అక్టోబర్ ఆరవ తేదీన వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని నాగార్జున ప్రోమో ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ , ప్రముఖ బిగ్ బాస్ రివ్యూ వర్ ఆదిరెడ్డి తాజాగా ఒక వీడియో వదిలారు. ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఆ వీడియోలో శనివారం రాబోయే ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ వీరే అంటూ వీడియో విడుదల చేశారు ఆదిరెడ్డి.మరి ఆదిరెడ్డి చెప్పిన మేరకు ఎవరెవరు హౌస్ లోకి రాబోతున్నారు ఇప్పుడు చూద్దాం.
మెహబూబ్, బిగ్ బాస్ సీజన్ -1 లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న హరితేజ, బిగ్ బాస్ సీజన్ 1 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే ఎలిమినేట్ అయిన నయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ ఇలా మొత్తం ఎనిమిది మంది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెడుతున్నారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే కొత్త వారిని కాకుండా ఆల్రెడీ బిగ్ బాస్ మిగతా 7 సీజన్లలో కంటెస్టెంట్ లుగా పార్టిసిపేట్ చేసిన వారిని ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా తీసుకు రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇకపోతే దీనిపై స్టార్ మా బిగ్ బాస్ టీం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read: Tirumala Laddu Row: సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ, చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ షర్మిల
Also Read: APSRTC: దసర పండగ... ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ.. డిటెయిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.