Bigg Boss Telugu 8th Season: ప్రేక్షకులకు వినోదంతోపాటు ఉత్కంఠ రేకెత్తించే టెలివిజన్‌ షో బిగ్‌ బాస్‌ ప్రారంభమైంది. తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ షో ఎనిమిదో సీజన్‌ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమైంది. యథావిధిగా మరోసారి సినీ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేస్తున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, మా టీవీలో ప్రసారమవుతున్న ఈ షో అట్టహాసంగా షురూవైంది. లిమిట్‌లెస్‌ అంటూ ఎనిమిదో సీజన్‌ను కింగ్‌ నాగార్జున ప్రారంభించారు. నాగార్జున అదే ఎనర్జీతో డ్యాన్స్‌లతో అదరగొట్టాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచన 


షో ప్రారంభానికి సీని నటులు దగ్గుబాటి రానా, నివేథా థామస్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, సినీ నటుడు నాని తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా నాని, అనిల్‌ రావిపూడి హౌస్‌లోకి వెళ్ల కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు. గతం కన్నా విభిన్నంగా ఈసారి కంటెస్టెంట్లను పంపించడమే బడ్డీలుగా పంపించారు. అమ్మాయి అబ్బాయిని జోడీగా హౌస్‌లోకి బిగ్‌బాస్‌ పంపించారు. ఇది చూస్తుంటే షో ప్రారంభమై పెద్ద ఫిట్టింగ్‌ పెట్టినట్లు కనిపిస్తోంది.

కంటెస్టెంట్లు వీరే..
యష్మీ గౌడ- సీరియల్‌ నటి
నిఖిల్‌ మళయక్కల్‌- సీరియల్‌ నటుడు
అభయ్‌ నవీన్‌- సినీ నటుడు (పెళ్లి చూపులు ఫేమ్‌)
ప్రేరణ- సినీ నటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter