Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచన 

Chiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 1, 2024, 11:28 AM IST
Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచన 

Chiranjeevi Request: ఊహించని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి.. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జలమయమయ్యాయి. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా అక్కడక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక సూచనలు చేశారు.

Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్‌ అలర్ట్‌.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన

'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. 'మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే! అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు' అని విజ్ఞప్తి చేశారు. వైద్యపరమైన జాగ్రత్తలు కూడా చిరంజీవి సూచించారు. 'వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి' అని చెప్పారు.

Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు

'ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని చిరంజీవి తెలిపారు. వర్షాల నేపథ్యంలో తన అభిమానులను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కాగా అధిక వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా ప్రభావితమవుతోంది. విజయవాడతో సహాయ అనేక నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు వర్షాలపై నిరంతరం సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అధికార యంత్రాగానికి సూచనలు చేస్తూ విపత్కర పరిస్థితుల్లో అధిక నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News