Bigg Boss Telugu Season 7 Promo Released: బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇన్నాళ్లు 7వ సీజన్ ఉంటుందా..? లేదా..? అనే అనుమానాలు ఉండగా.. తాజాగా ప్రోమోతో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా ప్రోమోను రిలీజ్ చేసి.. ఆసక్తిని క్రియేట్ చేశారు. బ్లూ అండ్ వైట్ కలర్‌లో లోగోను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. కాస్త ముందగానే ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే సెట్‌వర్క్ కంప్లీట్ కావడంతో అనుకున్న తేదీ కంటే ముందుగానే షోను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం నెట్టింట కంటెస్టంట్ల పేర్లపై చర్చ జరుగుతోంది. ఢీ షో నుంచి పాపులారిటీ సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ పండు, ఈటీవీ ప్రభాకర్, సిద్దార్థ్ వర్మ, అమర్ దీప్ చౌదరి, సాయి రోనక్, సింగర్ మోహన భోగరాజు ఇలా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే ఎవరిని ఫైనల్ చేస్తారనేది షో ప్రారంభం సమయంలోనే తెలుస్తుంది. గత సీజన్ అనుకున్నస్థాయిలో హిట్ అవ్వకపోవడంతో ఈసారి నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


గత సీజన్‌లో విన్నర్ ప్రకటించిన విధానంపై పెద్ద ఎత్తనే కౌంటర్లు పడ్డాయి. ఆడియన్స్ వేసిన ఓట్లతో సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. చివరికి ట్రోఫీ కావాలా..? డబ్బులు కావాలా..? అంటూ ఆఫర్ పెట్టగా.. శ్రీహాన్ డబ్బులు తీసుకోగా.. ట్రోఫీని తీసుకుని సింగర్ రేవంత్ విన్నర్‌గా నిలిచాడు. ఆ తరువాత శ్రీహాన్‌కే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించారు. ఇదంతా ఆడియన్స్‌ను గందరగోళానికి గురిచేసింది. ఐదు సీజన్లు సూపర్ హిట్ అయినా.. బిగ్‌బాస్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్ అంటూ వచ్చిన సీజన్‌ 6 మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.


గత సీజన్‌కు వ్యూవర్ షిప్ కూడా భారీగా తగ్గిపోవడంతో రేటింగ్‌ను కూడా ప్రకటించలేదు నిర్వాహకులు. ప్రతి సీజన్‌లో రేటింగ్ గురించి గొప్పగా చెప్పే నాగ్.. గత సీజన్‌లో మాత్రం రేటింగ్ అనే మాటే ఎత్తలేదు. అందుకేసారి వ్యూవర్‌షిప్ పెంచేందుకు కొంచెం పేరున్న సెలబ్రిటీలను కూడా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కంటెస్ట్ంట్ల ఎంపిక నుంచి పక్కాగా రంగంలోకి దిగేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు.


Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?  


Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి