MBBS To Falaknuma Metro: ఓల్డ్ సిటీ మెట్రో ఫైల్‌లో ఎట్టకేలకు కదిలిక వచ్చింది. పాతబస్తీ మెట్రో ఎక్కించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మున్సిపల్ అధికారులు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు చెప్పారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణమే పూర్తిచేయాలని చేయాలని కోరారని తెలిపారు. ప్రభుత్వం తరుఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఎల్ అండ్ టీ సంస్థకు హామీ ఇచ్చారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు. పాత బస్తీ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ నిర్ణయం ఓల్డ్ సిటీ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. టూరిజం పరంగా కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు.
మెట్రో రైలు తొలివిడతలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ 69.2 కిలోమీటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. కానీ పాతబస్తీ మార్గంలో అనేక ప్రార్థన మందిరాలు తొలగించాల్సి రావడంతో మజ్లిస్ పార్టీతోపాటు ఓల్డ్ సిటీ ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో 5.5 కిలోమీటర్ల నిర్మాణ పనులను ఎల్ అండ్ టీ సంస్థ నిలిపివేసింది. ఆ తరువాత ఎలైన్‌మెంట్ సర్వే నిర్వహించినా.. పనులు మాత్రం మొదలవ్వలేదు.
తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎంజీబీఎస్-ఫలక్‌నుమా వరకు నాలుగు మెట్రోస్టేషన్ల నిర్మాణానికి అలైన్‌మెంట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్ మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయం అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే.. నగరంలో మొత్తం మెట్రో విస్తీర్ణం 74.7 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?
Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి