Bigg Boss OTT Promo: మీ మొబైల్స్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి.. నో కామ, నో ఫుల్‌స్టాప్: నాగార్జున
Bigg Boss Non-Stop Second OTT Promo released: బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో తాజాగా మరోకటి వచ్చింది. ఫిబ్రవరి 26 సాయంత్రం ఆరు గంటల నుంచి బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం కానుందని నాగార్జున తెలిపారు.
Bigg Boss Non-Stop Second OTT Promo released: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరో 48 గంటల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కా బాప్ 'బిగ్‌బాస్' ఓటీటీ తొలి సీజన్ మొదలుకానుంది. బిగ్‌బాస్ తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా.. ఈసారి ఓటీటీలో ప్రసారం కానుంది. 24/7 వినోదం పంచే 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' షోకి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'డిస్నీ+ హాట్‌స్టార్'లో ఫిబ్రవరి 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమోను ఇదివరకే వదలగా.. తాజాగా మరోకటి వచ్చింది. ఫిబ్రవరి 26 సాయంత్రం ఆరు గంటల నుంచి బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం కానుందని నిర్వహకులు తెలిపారు. 'మీ మొబైల్స్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి.. ఎందుకంటే నో కామ, నో ఫుల్‌స్టాప్! బిగ్‌బాస్ ఇప్పుడు నాన్‌స్టాప్' అని హోస్ట్ నాగార్జున అన్నారు. ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే ఉందని షో మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబందించిన ప్రోమో యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నిడివి 18 సెకన్లుగా ఉంది.
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ వారం క్రితమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ ఖైదీ (వెన్నెల కిషోర్)కి ఉరిశిక్ష పడగా.. చివరి కోరిక ఏంటని పోలీస్ ఆఫీసర్ (మురళి శర్మ) అడుగుతాడు. బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ చూడాలనుకుంటుంన్నాడు అని లాయర్ (నాగార్జున) చెపుతాడు. అతని కోరిక మేరకు షోని ప్రసారం చేయగా.. నాన్ స్టాప్‌గా ప్రసారమయ్యే బిగ్‌బాస్‌కు ఎండ్ ఉండదు. దీంతో ఆ ఖైదీకి ఉరిశిక్ష పడదనే కాన్సెప్ట్‌తో ప్రోమోని తెరకెక్కించారు. చివరలో నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే కాప్షన్ ఇచ్చారు.
ఓటీటీ తొలి సీజన్‌కు హైప్ తెచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దింపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీలు అయిన ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ, అరియనాలు ఓటీటీలో పాల్గొననున్నారట. కొత్తగా యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ఢీ-10 విజేత రాజు, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి రంగంలోకి దిగుతున్నారట. ఏదేమైనా మరో రెండు రోజుల్లో కంటెస్టెంట్లు ఎవరో తేలనుంది.
Also Read: Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook