Bigg Boss Telugu OTT: అత్యంత ప్రజాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు మరో సంచలనానికి సిద్ధమౌతోంది. త్వరలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ లోగో విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అత్యంత ఘనంగా ముగిసినప్పటి నుంచి తరువాత సీజన్ ఎప్పుడా అనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఎప్పటిలా ఆలస్యంగా కాకుండా కేవలం 2 నెలల్లోనే నెక్స్ట్ సీజన్ ఉంటుందని బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదిక నుంచే నాగార్జున ప్రకటించాడు. అయితే నాగార్జున చెప్పిన ఆ నెక్స్ట్ సీజన్ ఓటీటీ వెర్షన్. తెలుగులో తెలిసారిగా ఓటీటీలో సైతం బిగ్‌బాస్ సిద్ధమైంది. ఈ నెలలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇప్పటికే కంటెస్టెంట్ల జాబితా దాదాపుగా ఖరారైంది. ఈసారి కంటెస్టెంట్ల జాబితా విషయంలో లీక్ లేకుండా బిగ్‌బాస్ యాజమాన్యం జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. 


తాజాగా బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ (Bigg Boss Telugu OTT)వెర్షన్ స్ట్రీమింగ్ లోగో విడుదలై..ట్రెండింగ్ అవుతోంది. డిస్నీ హాట్‌స్టార్ ఈ లోగోను విడుదల చేసింది. 2022లో అతిపెద్ద సర్ప్రైజ్ మొత్తానికి సిద్ధమైందని..బిగ్‌బాస్ నాన్‌స్టాప్ 24/7 వినోదాన్ని అందిస్తుందని..త్వరలో ఈ అద్భుతం మీ ముందుకు రానుందంటూ షేర్ చేసింది డిస్నీ హాట్‌స్టార్. తెలుగు ప్రేక్షకుల్ని సరికొత్త స్థాయిలో అలరిస్తుందంటూ లోగో షేర్ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.



Also read: Tollywood: మహేశ్ బాబుతో కలిసి ఏ పాత్రకైనా సిద్ధమేనంటున్న సుధీర్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook