Tollywood: మహేశ్ బాబుతో కలిసి ఏ పాత్రకైనా సిద్ధమేనంటున్న సుధీర్ బాబు

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో..అతని బావ సుధీర్ చిత్రం తెరకెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2022, 11:37 AM IST
Tollywood: మహేశ్ బాబుతో కలిసి ఏ పాత్రకైనా సిద్ధమేనంటున్న సుధీర్ బాబు

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో..అతని బావ సుధీర్ చిత్రం తెరకెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి తెలిసిందే. మహేశ్ బాబు, వెంకటేశ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. మరోసారి మహేశ్ బాబు మల్టీ స్టారర్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ అందుతోంది. అభిమానులు ఊహించినట్టే త్వరలో మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కవచ్చని సమాచారం. అది కూడా మహేశ్ బాబు బావ..సుధీర్ బాబుతో సినిమా రానుందని తెలుస్తోంది. 

ఈ విషయంపై సుధీర్ బాబు స్వయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మహేశ్ బాబుతో(Mahesh Babu)కలిసి సినిమా చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు సుధీర్ బాబు. ఈ ప్రశ్న తనను చాలామంది అడుగుతున్నారని..మహేశ్ బాబుతో కలిసి నటించాలంటే అందుకు తగ్గ కధ ఉండాలన్నాడు. అదే సమయంలో ఆ సినిమా తనకు చిరకాల జ్ఞాపకం కానుందన్నాడు. ఎవరో ఒకరు ఈ ఇంటర్వ్యూ విని..ఇద్దరినీ కలిపే ఓ కధ రాస్తారని ఆశిస్తున్నానన్నాడు మహేశ్ సరసన..ఏ పాత్రకైనా సిద్ధమన్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం వాలంటైన్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. 

Also read: Khiladi Movie: మీనాక్షి చౌదరికి ఆ దర్శకుడు ఎందుకు క్షమాపణలు చెప్పాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News