Bigg Boss 7: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7పై అధికారిక ప్రకటన ఎప్పట్నించి, కంటెస్టెంట్లు ఎవరెవరు
Bigg Boss 7: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎప్పుడు ప్రారంభమయ్యేది ఖరారైంది. ఈసారి బిగ్‌బాస్ తెలుగు అంచనాలకు అందకుండా ఉంటుందనే ప్రచారం చేస్తోంది బిగ్‌బాస్ యాజమాన్యం.
Bigg Boss 7: బిగ్‌బాస్ తెలుసు ఇప్పటి వరకూ 6 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 7 కోసం అంతా ఎదురుచూస్తున్నారు. సీజన్ 7కు సంబంధించి చాలా అంశాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది. బిగ్‌బాస్ స్వయంగా ప్రకటించేవరకూ ఏదీ బయటకు రావడం లేదు. ఇప్పుడు ప్రారంభతేదీ వెలువడింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎప్పుడు ప్రారంభమయ్యేది యాజమాన్యం నుంచి ప్రకటన వెలువడింది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుందని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఎప్పటిలానే ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జదున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమో విడుదలైంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సరికొత్తగా, ఎవరి అంచనాలకు అందకుండా ఉంటుందని తెలిపే విధంగా ఓ ప్రోమో విడుదలైంది. అందులో ఇద్దరు ప్రేమికులుంటారు. ప్రేమికుడు కొండపై నుంచి పడిపోతుంటే..ప్రియురాలు చున్నీ ఇచ్చి లాగుతుంటుంది. అందరూ ఊహించేది ఆ చున్నీ సహాయంతో ఆ ప్రేమికుడు బయటపడతాడనే. కానీ ఇక్కడ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చింది. చున్నీతో పైకొచ్చే క్రమంలో ఆ ప్రేమికురాలికి తుమ్ము రావడంతో చున్నీ వదిలేస్తుంది. ఆ ప్రియుడు కిందకు పడిపోతాడు. అంటే మీ అంచనాలకు అందకుండా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఉంటుందని ప్రోమో ద్వారా నాగార్జున వివిరంచే ప్రయత్నం చేశాడు.
సాధారణంగా బిగ్‌బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే కంటెస్టెంట్లు ఎవరనేది దాదాపుగా క్లారీటీ వచ్చేసుంటుంది. కానీ ఈసారి కంటెస్టెంట్ల విషయంలో గోప్యత కన్పిస్తోంది. కొందరి పేర్లు విన్పించడమే తప్ప అందరి పేర్లు తెలియడం లేదు. ఎవరు పాల్గొంటున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ మాత్రం సెప్టెంబర్ 3 న ఉండనుంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సీజన్ 2కు నాని హోస్ట్ చేశాడు. ఆ తరువాత నాలుగు సీజన్లకు కింగ్ నాగార్జునే హోస్ట్‌గా ఉన్నాడు. ఇప్పుడు సీజన్ 7 హోస్ట్ కూడా కింగ్ నాగార్జునే కావడం విశేషం.
Also read: Top 5 Web Series: ఈ ఐదు సైకో థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లు చూస్తే సస్పెన్స్‌తో గుండాగిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook