BiggBoss Telugu 5 Grand Finale: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ జరగనంత భారీగా గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు సిద్ధమౌతున్న తరుణంలో అతిధులు ఎవరనే విషయంపై ఆసక్తి పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ మరి కాస్సేపట్లో జరగనున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేపై అంచనాలు పెరుగుతున్నాయి. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇవాళ్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు హాజరుకానున్న సెలెబ్రిటిలు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ప్రతిరోజూ సెలెబ్రిటీల జాబితా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. 


బిగ్‌బాస్ టాప్ 3 కంటెస్టెంట్లుగా సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌లు ఉండవచ్చనేది ఓ అంచనా. ఈ ముగ్గురిలో సన్నీకే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5(BiggBoss Telugu Season 5)టైటిల్ దక్కుతుందని సర్వత్రా విన్పిస్తోంది. ముందు నుంచి ఊహించినట్టుగానే గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండనుంది. టాలీవుడ్‌లో వరుస సినిమాలుండటంతో సినిమా ప్రమోషన్‌కు లాభపడేలా గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఉండనుందని తెలుస్తోంది. అంటే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై వివిధ సినిమాల ప్రమోషన్ ఉండనుంది. అందుకే పెద్దఎత్తున సెలెబ్రిటీలు హాజరుకావచ్చు.


ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ నుంచి రాజమౌళి(Rajamouli), రామ్‌చరణ్, అలియా భట్‌లు  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు(BiggBoss Telugu 5 Grand Finale)హాజరుకానున్నారని ఇప్పటికి దాదాపుగా ఖరారైంది. బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ లాంచ్ కోసం హైదరాబాద్ అలియా భట్(Alia Bhatt)ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉంది. మరోవైపు నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా వచ్చేవారం విడుదల కానుంది. ఈ సినిమా టీమ్ నుంచి నాని(Nani), సాయి పల్లవి, కృతిశెట్టిలు హాజరు కావచ్చు. ఇక ఫ్లవర్ కాదు..ఫైర్ అంటూ హల్‌చల్ చేస్తున్న పుష్ప దర్శకుడు, లెక్కల మాస్టారు సుకుమార్(Sukumar)దాదాపుగా ఖరారయ్యారు.  


టీమ్ ఇండియా గెల్చుకున్న తొలి ప్రపంచకప్ బయోపిక్‌గా(World Cup Biopic) వస్తున్న 83 ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయనుంది. ఈ సినిమా హీరో బాలీవుడ్‌కు చెందిన రణవీర్‌సింగ్‌ను బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు రప్పించే పరిస్థితులున్నాయి.


Also read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ నుంచి మరో లీక్, టైటిల్ విన్నర్ అతడేనా, టాప్ 3లో ఎవరు మరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook