BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ నుంచి మరో లీక్, టైటిల్ విన్నర్ అతడేనా, టాప్ 3లో ఎవరు మరి

BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మరి కాస్సేపట్లో ముగియనుంది. 15 వారాలుగా అత్యంత విజయవంతంగా నడుస్తున్న అతిపెద్ద రియాలిటీ షోకు తెరపడనుంది. మరి విన్నర్ ఎవరు, టాప్ 3లో ఉండేదెవరనే విషయంలో అప్పుడు భారీ చర్చే నడుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2021, 06:17 AM IST
BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ నుంచి మరో లీక్, టైటిల్ విన్నర్ అతడేనా, టాప్ 3లో ఎవరు మరి

BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మరి కాస్సేపట్లో ముగియనుంది. 15 వారాలుగా అత్యంత విజయవంతంగా నడుస్తున్న అతిపెద్ద రియాలిటీ షోకు తెరపడనుంది. మరి విన్నర్ ఎవరు, టాప్ 3లో ఉండేదెవరనే విషయంలో అప్పుడు భారీ చర్చే నడుస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. 15 వారాలుగా దిగ్విజయంగా ప్రదర్శితమైన బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ఉండనుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ లు ఈసారి  జరిగే గ్రాండ్ ఫినాలేకు(BiggBoss Telugu Grand Finale) ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్లు ఉంటారు. నిన్న అంటే శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అంటే ఇప్పటికే మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సందడి చేశారు. 

ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అవడంతో ఇక విన్నర్ ఎవరనే విషయంలై వివిధ రకాల వార్తలు ట్రోల్ అవుతున్నాయి. వివిధ అంశాలు లీక్ అవుతున్నాయి. టాప్ 5లో చివరి రెండు స్థానాల్లో ఉన్నవారిని ఎలిమినేట్ చేసే ప్రక్రియ ఇప్పటికే షూట్ అవడంతో.. ఆ ఇద్దరు ఎవరనేది లీక్ అయిందని తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చివరి స్థానంలో నిలిచిన సిరి ముందుగా ఎలిమినేట్ కాగా. 4వ స్థానంలో ఉన్న మానస్ ఆ తరువాత ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఇప్పటివరకూ బిగ్‌బాస్ హౌస్‌కు(BiggBoss House)సంబంధించి లీక్ అయ్యే వార్తలు దాదాపుగా నిజమైన నేపధ్యంలో ఈ లీక్ వార్త కూడా నిజమే కావచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

అయితే టాప్ 3 స్థానాల్లో ఎవరనేది కూడా అనధికారికంగా ట్రోల్ అవుతోంది. ఓటింగ్ పరంగా సన్నీ అందరికంటే టాప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. టాప్ 5 ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతిరోజూ నమోదవుతున్న ఓటింగ్‌లో సన్నీనే 52 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నాడని సమచారం. అదే శుక్రవారం వరకూ కొనసాగడంతో సన్నీ(Sunny)టైటిల్ విన్నర్ అనే వార్త ట్రోల్ అవుతోంది. ఇక మిగిలిన రెండు, మూడు స్థానాల కోసం షణ్ముఖ్ , శ్రీరామచంద్ర మధ్య హోరాహోరీ పోరు ఉందని సమాచారం. ఓ దశలో షణ్ముఖ్(Shanmukh)రన్నర్‌గా ఉంటాడని దాదాపుగా ఖాయమైనా..తిరిగి శ్రీరామచంద్ర(Sriramachandra)అనూహ్యంగా పుంజుకోవడంతో ఆ రెండు ఫలితాలు తారుమారై ఉండవచ్చని తెలుస్తోంది. 

Also read: RRR Pre Release : ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు అంతా రెడీ.. హోస్ట్‌గా బాలీవుడ్‌ మెగాస్టార్‌?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News