Bigg Boss Telugu 4: మెగా ఫినాలే అతిధి ఎవరో తెలుసా..4 గంటల సేపు రచ్చరచ్చే..
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మరో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే వారమే బిగ్‌బాస్ 4 మెగా ఫైనల్ జరగనుంది. బిగ్‌బాస్ మెగా ఫినాలేను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ మెగా ఫినాలేకు హాజరయ్యే అతిధులెవరో తెలుసా..
ప్రఖ్యాత రియాలిటీ షో ( Reality show ) బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ( Biggboss telugu season 4 ) వచ్చే వారం ముగియనుంది. ఫైనల్‌కు చేరుకున్న టాప్ 5 లో విన్నర్ ఎవరనేది తేల్చడానికి ఓటింగ్ ప్రారంభమైపోయింది. బిగ్‌బాస్ హౌస్ ( Biggboss house ) నుంచి మోనాల్ ఎలిమినేట్ అవడంతో టాప్ పైవ్ కంటెస్టెంట్లుగా ( Top 5 Contestants ) అఖిల్, అభిజీత్, సుహైల్, అరియానా, హారికలు మిగిలారు. హాట్ ఫేవరెట్లుగా అఖిల్, అభిజీత్ పేర్లు గట్టిగా విన్పిస్తున్నా..సుహైల్, అరియానా, హారికలకు కూడా తీసిపోలేదు. విన్నర్ ఎవరనేది తేల్చేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు.
బిగ్‌బాస్ షో ఫైనల్ ( Biggboss Show final ) కు చేరుకోవడంతో మెగా ఫినాలే ( Mega Finale )కు హాజరయ్యే అతిధి ఎవరనేది ఆసక్తిగా మారింది. టీఆర్పీ రేటింగ్ లక్ష్యంగా చేసుకుని చాలా గ్రాండ్‌గా ఫినాలే ఉండేలా బిగ్‌బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. అందుకే మెగా ఫినాలేకు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) లేదా చిరంజీవి ( Chiranjeevi )వస్తారని విన్పిస్తోంది.
నాలుగు గంటల సేపు సాగే మెగా ఫినాలే ఎపిసోడ్‌లో టాలీవుడ్ హీరోయిన్లు మెహ్రీన్ పీర్‌జాదా, లక్ష్మీరాయ్‌లు ఆటపాటలతో అలరిస్తూ రచ్చరచ్చ చేయడానికి సిద్ధమౌతున్నట్టు సమాచారం. స్టేజ్‌పై డ్యాన్స్ కోసం మరో ఇద్దరు హీరోయిన్లు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. Also read: Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలేకు ముందే అభిజిత్ రికార్డుల హోరు!