BiggBoss Telugu5: Akkineni Nagarjuna says will tell Breaking News Elimination ‌Start a day earlier: బిగ్‌బాస్‌ ప్రతి వీకెండ్‌ ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వారం రోజుల పాటు హౌస్‌లో జరిగే సంఘటలన్నింటిపై జడ్జిమెంట్‌ ఇస్తాడు కింగ్ నాగార్జున (Nagarjuna). అయితే ఈ సారి మాత్రం నాగ్.. ఒకరోజు ముందే ఎలిమినేష‌న్‌ (Elimination) ప్రక్రియ మొదలుపెట్టేశాడు. రీసెంట్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చూస్తే ఈ విషయం తెలుస్తోంది. అంద‌రికీ ఓ బ్రేకింగ్ న్యూస్ (Breaking News) చెప్ప‌బోతున్నాన‌నంటూ స‌స్పెన్షన్‌లో పెట్టాడు నాగ్. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు అర్హ‌త లేనివాళ్లు ఎవ‌రో చెప్పండి అంటూ ఒక్కొక్క‌రినీ క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి మ‌రీ అడిగాడు కింగ్. దీంతో హౌజ్‌మేట్స్ అంతా పేర్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Sherlyn Chopra : రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిపై కేసు పెట్టిన షెర్లిన్ చోప్రా


చివరకు.. ప్రియ‌కు, (Priya) లోబోకు (Lobo) ఇద్ద‌రికీ 4 ఓట్లు ప్రకారం ప‌డ్డాయి. దీంతో నాగ్‌.. వీరిలో ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తారో వారి ప‌క్క‌న నిల్చోమ‌ని హౌజ్‌మేట్స్‌కు చెప్పాడు. అంతేకాదు వీరిద్దరిలో ఒకరిని బయటకి పంపేందుకు బిగ్‌బాస్‌ గేట్లు కూడా తెరిపించేశాడు నాగ్. అయితే బిగ్‌బాస్‌ (BiggBoss) ఇలా అర్ధాంత‌రంగా ఎందుకు ఎలిమినేషన్‌ ప్రక్రియ పెట్టారు అనే విషయంపై ఇప్పుడు నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.



 


Also Read : Manchu Vishnu : ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు మా విజయాన్ని గౌరవించాలి ‌‌- మంచు విష్ణు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి