Bimbisara Director Vasishta acted as Hero in Premalekha raasa: సాధారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాము అని ఒకప్పుడు నటీనటులు ఎక్కువగా చెబుతూ ఉండేవారు. కానీ సినీ రంగంలో ఎవరికి ఏది రాసిపెట్టి ఉందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దర్శకులుగా మారాలని వచ్చి తర్వాత నటీ నటులుగా మారి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారు ఉన్నారు. నటులుగా మారాలని వచ్చి దర్శకత్వ విభాగం వైపు మళ్లి దర్శకులుగా మెరిసిన వారు ఉన్నారు. ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ట గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వశిష్ట బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి ఏమీ కాదు. ఒకప్పటి టాప్ ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ కుమారుడే ఈ వశిష్ట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి అతని అసలు పేరు వెంకట్ ఇంట్లో వాళ్ళు మాత్రం ముద్దుగా వేణు అని పిలుస్తూ ఉంటారు. దాదాపుగా సినీ పరిశ్రమలో అందరికీ కూడా అతను వేణు అనే పరిచయం. మల్లిడి సత్యనారాయణ గతంలో బన్నీ, భగీరథ, ఢీ వండి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన కుమారుడిగా వేణుకి కూడా సినీ రంగంలో అనేక పరిచయాలు ఉన్నాయి. అయితే 2007వ సంవత్సరంలో ప్రేమలేఖ రాశా అనే సినిమాతో వెంకట్ హీరోగా పరిచయమయ్యాడు. అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమాతోనే అప్పట్లో గీత రచయితగా ఫామ్ లో ఉన్న కులశేఖర్ దర్శకుడిగా మారారు. అయితే కర్ణుడు చావుకు వంద కారణాలు అన్న విధంగా అనుకున్న సమయానికి సినిమా విడుదల కాలేదు.


తర్వాత ఎప్పుడో విడుదలైంది విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ప్రస్తుతానికి ఈ సినిమా యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. అయితే హీరోగా నటించిన మొదటి సినిమా విషయంలో ఏర్పడిన కొన్ని చేదు అనుభవాల నేపథ్యంలో వేణుకు నటన మీద ఆసక్తి పోయింది. దీంతో దర్శకత్వం వైపు అడుగులు వేస్తూ తాను కొన్ని కథలు రాసుకుని అప్పటి నుంచి హీరోల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆ మధ్య అల్లూ శిరీష్ హీరోగా ఒక సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఎందుకో అది ముందుకు వెళ్లలేదు. తరువాత ఒక సోషియో ఫాంటసీ కథ రెడీ చేసుకుని చాలామంది హీరోల దగ్గరకు తిరిగారు. కానీ చివరికి కళ్యాణ్ రామ్ కాంపౌండ్ లో ఆ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ లభించింది.


వెంకట్, వేణు అనే పేర్లు తనకు కలిసి రాలేదు అనుకున్నాడో ఏమో తన పేరును వశిష్టగా మార్చుకుని బింబిసార అనే ప్రాజెక్టు పూర్తి చేశాడు. నిజానికి ఈ కథ ఎన్టీఆర్ కోసం తీసుకువెళ్లారు కానీ అది కళ్యాణ్ రామ్ కు ఫైనల్ అయిందని అంటూ ఉంటారు. అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పక్కన పెడితే కళ్యాణ్ రామ్ తో అయినా ఇలాంటి సినిమా ఒప్పించి చేయడం అనేది గొప్ప విషయమే. అందుకే ఆ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలోనే వశిష్ట హీరోగా నటించిన సినిమా గురించి కూడా ఇప్పుడు ప్రేక్షకులు విపరీతంగా వెతుకుతున్నారు. 


Also Read: Shivani: పొట్టి గౌనులో చుట్టుకొలతలు చూపిస్తూ కాక రేపిన శివానీ రాజశేఖర్‌..కళ్ళతోనే కవ్వింపులు


Also Read:  Shalini Pandey: చాన్నాళ్లకు షాలిని పాండే అందాల విందు.. ఏకంగా ‘బ్రా’తో హాట్ ట్రీట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook