Vijay Devarakonda: ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ సాహిబా ప్రోమో.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

Sahiba: విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. తనదైన స్టైల్ తో ఈ రౌడీ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ ఒకసారి కొత్త మ్యూజిక్ ఆల్బమ్ తో అందరినీ ఆకట్టుకోనున్నారు.
Vijay Devarakonda Album Song: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఏమి చేసినా అదొక సెన్సేషన్ గానే..నిలుస్తుంది. అందుకే ఆయనకి ఎంతోమంది ప్రత్యేక అభిమానులు ఉన్నారు. వరస ఫ్లాపులు వచ్చిన విజయ్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యనే కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన ఈ హీరో.. ఇప్పుడు ఒక ఆల్బమ్ సాంగ్ లో కనిపించనున్నారు.
గత కొద్ది రోజుల క్రితం విడుదలైన హీరియే ఆల్బమ్ సాంగ్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కనిపించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ని టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తెరకెక్కించగా.. ఇప్పుడు తాను మళ్ళీ చాలా రోజుల క్యాప్ తరువాత.. కొత్త సాంగ్ "సాహిబా"తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోనున్నారు. "హీరియే" పాటలో, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెరవగా..ఇప్పుడు "సాహిబా" ఆల్బమ్ సాంగ్ లో ఏకంగా మన రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించారు. ఇక ఈ సాంగ్లో విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించి ఆకట్టుకోనున్నారు.
సుధాంశు సరియా దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్ సాంగ్ ని సరికొత్త సంగీత శైలి, వినసంపైన మ్యూజిక్, మరెన్నో భావోద్వేగాలతో " శ్రోతల ముందుకు తీసుకురాబోతున్నారు జస్లీన్ రాయల్. ఇక ఈ సాంగ్ చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో.. నిలిచిపోయేలా రూపొందించారు అని ఈరోజు విడుదలైన ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.
ఇక ఈరోజు విడుదలైన ఈ సాంగ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించి నొప్పించారు. విజయ్, రాధిక మదన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సాంగ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. "సాహిబా" కంప్లీట్ మ్యూజిక్ వీడియో ఈ నెల 15న విడుదల చెయ్యనున్నారు. ఇక ఈ ప్రోమోతోనే ఈ మ్యూజిక్ ఆల్బమ్ పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో తెగ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. మధ్యలో ఒక ఆల్బమ్ సాంగ్ చేయడంతో.. ఆయన అభిమానుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం
Also Read: KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి