Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం

KT Rama Rao Complaint Against Revanth Reddy AMRUT 2.0 Scam: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు, అవినీతిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. రేపు మంగళవారం ఢిల్లీలో బాంబు పేలుస్తారనే వార్త ఉత్కంఠ రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 11, 2024, 10:49 PM IST
Amruth Scam: రేపు బాంబు పేల్చనున్న కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతిపై ఢిల్లీస్థాయిలో పోరాటం

Revanth Reddy AMRUT Scam: కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలు.. రేవంత్‌ రెడ్డి అస్తవ్యస్త పాలనపై తెలంగాణలో పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ స్థాయిలో పోరాటం మొదలుపెట్టారు. రేవంత్‌ రెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మంగళవారం సంచలన ప్రెస్‌మీట్‌ ఉండనుందని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌ పేలుస్తానన్న బాంబు కేటీఆర్‌ పేలుస్తారనే చర్చ జరుగుతోంది.

Also Read: KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇది

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ పథకం టెండర్లలోనూ రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అమృత్‌ కుంభకోణం ఎలా జరిగింది? మొత్తం సమగ్రంగా వినతిపత్రంలో కేటీఆర్‌ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Also Read: IAS Transfers: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్‌ రెడ్డి ప్రమోషన్‌

'అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కేటాయింపు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.2 కోట్ల లాభం చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల ప్రాజెక్టు అప్పగించారు. ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి కనుసన్నుల్లో జరుగుతున్న మరో కుంభకోణం' అని కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో కేటీఆర్‌ వివరించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి సొంతవారికి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని ఆరోపణలు చేశారు.

'అమృత్ టెండర్ల విషయంలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పనులను అప్పగించారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి కేటాయించిన పనులపై పారదర్శకంగా విచారణ జరిపించాలి. అమృత్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణకు కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కూడా విచారణ జరిపించండి. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి' అని కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కేటీఆర్‌ కోరారు.

మంగళవారం ప్రెస్‌మీట్‌
తెలంగాణలో రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు, అవినీతిపై మంగళవారం కేటీఆర్‌ బాంబు పేల్చనున్నారు. తెలంగాణ ప్రభుత్వ తప్పిదాలు, కుంభకోణాలు, ఆరు గ్యారంటీలు నెరవేర్చకపోవడం.. రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకపోవడం వంటివి కేటీఆర్‌ జాతీయ మీడియాకు వివరించనున్నారు. ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో అమృత్‌ కుంభకోణం కూడా కేటీఆర్‌ వివరంగా తెలపనున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ బాంబు పేలుస్తానని ప్రకటించగా.. వాటిని నిజం చేసేలా కేటీఆర్‌ ఢిల్లీలో బాంబు పేలుస్తాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News