Konaseema Thugs Movie Review: హే సినామిక సినిమాతో దర్శకురాలిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం కోనసీమ థగ్స్. ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన థగ్స్ సినిమాని తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తమ కొత్త మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోనసీమ థగ్స్ కథ విషయానికి వస్తే
శేషు (హ్రిదు హరూన్) అనాధ ఎలాంటి తోడు నీడ లేని అతన్ని కాకినాడకు చెందిన పెద్దిరెడ్డి అనే రౌడీ తన దగ్గర పనికి పెట్టుకుంటాడు. శేషు ఆ ప్రాంతంలోనే అనాధాశ్రమంలో పెరుగుతున్న మూగ అమ్మాయి కోయిల (అనశ్వర రాజన్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నా సమయంలో ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు.


అలా కాకినాడ జైలుకు వెళ్లిన శేషు కి దొర (బాబీ సింహ), మధు (మునిష్ కాంత్) సహా అనేకమంది మనుషులు పరిచయం అవుతారు. అయితే వారితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్ వేస్తాడు. జైలు గదిలో సొరంగం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అయితే శేషు అండ్ కో పోలీసులు కళ్ళు కప్పి సొరంగం ఎలా తవ్వారు? చివరికి వాళ్ళు ఆ సొరంగం నుంచి తప్పించుకున్నారా? అసలు శేషు ఎందుకు జైలు పాలయ్యాడు? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకున్నారు? చివరికి కోయిలా శేషు కలిశారా అనేది సినిమా కథ.


విశ్లేషణ:
ఒకరకంగా ఇదొక కొత్త ప్రయత్నం అని చెప్పలేం, ఎందుకంటే రొటీన్ సినిమా లాగానే మొదటి నుంచి చివరి వరకు అనిపిస్తుంది. దారుణమైన పరిస్థితిలో ఉన్న జైల్లో పడిన హీరో దాని నుంచి ఎలా తప్పించుకోవాలనుకున్నాడు అనేది ఈ సినిమా కథ. శేషు లవ్ స్టోరీతో పాటు బాబీ సింహ ఎందుకు జైలుకు వెళ్లాడు? అనేది తెలియజెప్పేందుకు అన్నట్టుగా ఫస్టాఫ్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ కలుగుతాయి. అయితే ఎస్కేప్ ప్లాన్ తో ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంక్ కాస్త ఆసక్తి రేకెత్తిస్తోంది.


సెకండ్ ఆఫ్ పూర్తిస్థాయిలో కొంతమేరకు ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కామెడీ, రొమాన్స్ ఉన్నప్పటికీ అవి కథను తప్పుదోవ పట్టించకుండా బృందా రాసుకున్న స్క్రీన్ ప్లే బాగా వర్క్ అవుట్ అయింది. యాక్షన్ సీన్స్ కూడా కొంత రియలిస్టిక్ గా అనిపించాయి. ఫస్టాఫ్ ని కాస్త ఆసక్తికరంగా మలిచి తెలుగు టైటిల్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉంటుందేమో. కథను నిదానంగా ప్రారంభించినా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరేట్ చేసే విషయంలో మాత్రం దర్శకురాలు సఫలం అయింది.


నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే హీరో హ్రిదు హరూన్ కి ఇది మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా అలా అనిపించలేదు. ఎలాంటి భయం వెలుగు లేకుండా నటించాడు హ్రిదు హరూన్. హ్రిదు హరూన్ ఎమోషన్ సీన్స్ లో కాస్త వర్క్ చేసి ఉండాల్సింది కానీ యాక్షన్ సీన్స్ లో మాత్రం ఒక మాదిరిగా ఆకట్టుకున్నాడు. బాబీ సింహ మాత్రం తనదైన శైలిలో జీవించాడు, ఇలాంటి పాత్రలో ఆయనకు కొత్త కాదు దీంతో ఒక రకంగా ఆ పాత్రతోనే ఆడేసుకున్నాడు. డైలాగ్స్ పెద్దగా లేకపోయినా బాబీసింహ పాత్ర సినిమాకు బాగా ప్లస్. ఇక కోయిల పాత్రకు మలయాళ భామ అనస్వర రాజన్ సరిగ్గా సూట్ అయింది. ఇక పాత్ర చిన్నది అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. ఇక మునీష్ కాంత్ కామెడీ సినిమాకి ప్రధాన అసెట్ గా నిలుస్తుంది.


టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే
బృందాగోపాల్ పనితనం మొదటి సినిమా కంటే మెరుగుపడినట్టు అనిపించింది. సామ్ సిఎస్ సంగీతం సినిమా లెవల్ ని మరో స్థాయికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పచ్చు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం మాత్రం బాగా ప్లస్ అయింది. గురుస్వామి సినిమాటోగ్రఫీ సైతం సినిమాకి ఒక అసెట్, ఎడిటింగ్ మీద మరింత దృష్టి పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా సెట్ అయ్యాయి.


ఫైనల్ గా:
కోనసీమ థగ్స్ ఒక యాక్షన్ థ్రిల్లర్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. 
Also Read: Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!


Also Read: Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook