Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!

Rocking Rakesh- Jordar Sujatha Marriage: జబర్దస్త్ లో కలిసి స్కిట్లు చేస్తూ ప్రేమలో పడ్డ రాకింగ్ రాకేశ్, జోర్దర్ సుజాత జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 12:55 PM IST
Rocking Rakesh Marriage: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు.. ఇక అఫీషియల్!

Rocking Rakesh- Jordar Sujatha Marriage Photos: చాలా కాలం నుంచి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రాకింగ్ రాకేష్ ఎప్పటినుంచో కామెడీ ప్రోగ్రాములు చేస్తూ వస్తున్నాడు, యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి పిల్లలతో కలిసి షో చేస్తూ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. అయితే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కి ముందుగా జోర్దార్ సుజాతతో పరిచయం లేదు కానీ బిగ్ బాస్ కి వెళ్లిన జోర్దార్ సుజాత తర్వాత పలు ఎంటర్టైనింగ్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తన టీం లో ఒక స్కిట్ కోసం ఆమెను సంప్రదించిన రాకేష్ ఎట్టకేలకు ఆమె ప్రేమికుడిగా మారిపోయాడు.

గత కొంతకాలం నుంచి వీరు ప్రేమించుకుంటున్న విషయం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. బుల్లితెర మీద అనేక కార్యక్రమాలలో జంటగా సందడి చేసిన ఈ జంట ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు జబర్దస్త్ కమెడియన్స్ సమక్షంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగగా వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పలువురు బుల్లితెర నటీనటులు సహా నెటిజనులు సైతం వీరికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టెలివిజన్ న్యూస్ ప్రజెంటర్గా కెరియర్ మొదలుపెట్టిన సుజాత తెలంగాణ యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక న్యూస్ ఛానల్లో జోర్దార్ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా మారిన ఆమె జోర్దార్ సుజాతగా పాపులారిటీ తెచ్చుకుంది. అలా బిగ్ బాస్ ఎంట్రీ అవకాశం దక్కించుకున్న ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీ పెంచుకుంది. జబర్దస్త్ షో ద్వారా రాకేష్ కు పరిచయమైన ఆమె రాకేష్ తో కలిసి అనేక షోలలో జంటగా పాల్గొంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఎట్టకేలకు ఒక్కటయ్యారన్నమాట.

Also Read: Happy Birthday Nani: అసిస్టెంట్ డైరెక్టర్ టు నేచురల్ స్టార్.. నాని ప్రస్థానం తెలుసా?

Also Read: Hero Nani Movies: 'దసరా'తో సందడి చేయనున్న నాని.. దిమ్మతిరిగిపోయే లైనప్ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News