Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?

Surekha Vani Latest Photo: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సురేఖా వాణి ఈ మధ్య హాట్ ఫొటోలతో పాటు పద్దతిగా ఉండే చీర కట్టు ఫోటోలు కూడా షేర్ చేస్తోంది, తాజాగా అలా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 24, 2023, 02:00 PM IST
Surekha Vani Photos: అన్నం తింటున్నావా అందం తింటున్నావా.. ఎల్లోరా శిల్పంలా సురేఖా వాణి ఫోజులు చూశారా?

Surekha Vani Latest Saree Photo: తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో తెలుగు నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ఆమె భర్త అనారోగ్య కారణాలతో కన్నుమూసిన తర్వాత కొంతకాలం ఆమె డిప్రెషన్ కి వెళ్ళిపోయారు, ఆమె కుమార్తె ఆమెను సోషల్ మీడియాకి పరిచయం చేసి కొంత సోషల్ మీడియాతో అటాచ్ చేయాలా చేసిన తర్వాత ఆమె కొంత కోలుకుంది.

ఇప్పుడు దానికి బాగా అలవాటు పడిపోయిన ఆమె తన హాట్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎప్పటికప్పుడు తన కుమార్తెకు పోటీగా ఫోటోలు షేర్ చేస్తుంది అంటూ పలువురు కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ఈ మధ్యకాలంలో తన కుమార్తెతో కలిసి గోవా వెళ్లిన ఆమె కుమార్తెకు పోటీగా ఉందా అన్నట్టుగా అందాలు ఆరబోస్తూ కుమార్తె సైతం షాక్ ఇచ్చే విధంగా కొన్ని ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపింది. ఇక ఆమె షేర్ చేస్తున్న ఫోటోల మీద రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి.

ఎక్కువగా ఆమె ఫిజిక్ గురించి బాడీ గురించి మాత్రమే కుర్రకారంతా చర్చిస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం అసలు ఈ విషయాలు ఏవీ పట్టించుకోదు, తనకు ఇష్టమైన పని తాను చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం కూడా ఆమె గోవాలో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు కాకరేపాయి. ఇక ఇప్పుడు ఆమె ఇంటికి తిరిగి వచ్చేసినట్లు కనిపిస్తోంది అందుకే కాస్త పద్ధతిగా చీర కట్టుకుని చీర కట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా పింక్ శారీలో ఆమె అందాలు ఆరబోస్తూ నిలబడి తన ఇంస్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ థాంక్స్ చెప్పింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surekhavani (@artist_surekhavani)

ఇప్పుడు తాజాగా బాపు బొమ్మలా, ఎల్లోరా శిల్పంలా నిలబడిన ఒక ఫోటోని షేర్ చేసింది. అందులో ఆమె ఒక చెక్క ఇంటిపై చేతులు పైకెత్తి నిలబడి ఉండగా వెనకనుంచి సూర్య రష్మి ఆమె మీద పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినిమాటిక్ లెవెల్ లో ఉన్న ఈ ఫోటో మీద ఇప్పుడు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఆమె అభిమానులు. ఇప్పుడు జనాలకి మీరు కావాలి అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే మరొకరు మాత్రం ఒక్కసారి వెనక్కి తిరగండి ప్లీజ్ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ అబ్బా బ్యాక్ ఫోజు అదిరింది మీరు అదరగొట్టేసారు డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే అన్నం తింటున్నావా అందం తింటున్నావా ఎంత అందం ఎలా అంటూ ఆమె మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రకరకాల కామెంట్లతో నెటిజన్లందరూ తమ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: Happy Birthday Nani: అసిస్టెంట్ డైరెక్టర్ టు నేచురల్ స్టార్.. నాని ప్రస్థానం తెలుసా?

Also Read: Hero Nani Movies: 'దసరా'తో సందడి చేయనున్న నాని.. దిమ్మతిరిగిపోయే లైనప్ చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News