Actress Isha Koppikar shocking Comments: 90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటి ఇషా కొప్పికర్‌ (Isha Koppikar). తాజాగా ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ (Casting couch) పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది ఇషా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''మా ఫ్యామిలిలో ఎక్కువ మంది డాక్టర్లే. కాలేజీ రోజుల్లో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. అదే సమయంలో నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలో ఓ నిర్మాత నుంచి నాకు కాల్‌ వచ్చింది. ‘మేము చేస్తున్న మూవీలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని ఒంటరిగా కలవండి' అని ఆయన చెప్పాడు.


''ఆ సమయంలో నిర్మాత మాటలు నాకు అర్థం కాలేదు. దాంతో ఆ హీరోకి కాల్‌ చేశా.  మీ స్టాఫ్‌ని తీసుకురాకుండా మీరు ఒక్కరే ‘ఒంటరిగా నా వద్దకు రండి అని ఆ హీరో చెప్పడంతో వాళ్ల ఉద్దేశం నాకు అర్థమైంది. ఆ మాటల నాకు బాధ కలిగించాయి. వెంటనే నిర్మాతకు ఫోన్‌ చేశా. ‘నా ప్రతిభ ఆధారంగా చేసుకుని ఆఫర్స్‌ వస్తే చేస్తాను అని గట్టిగా చెప్పేశాను. దీంతో ఆహీరోని కలవలేదనే కారణంతో నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు'' అని చెప్పుకొచ్చింది ఇషా. అయితే ఈ బ్యూటీ హీరో ఎవరనేది బయటపెట్టలేదు.


తెలుగులో 'చంద్రలేఖ', 'ప్రేమతో రా', 'కేశవ' సినిమాల్లో నటించింది ఇషా. అయితే ఈ భామ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈమె కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇషా పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది. 


Also Read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook