బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి నేహా దూపియా
బాలీవుడ్ నటి నేహా దూపియాకు పెళ్లయిపోయింది
బాలీవుడ్ నటి నేహా దూపియా ఇంకా సింగిల్ ఉమన్ కాదు. అవును, ఆమెకు పెళ్లయిపోయింది. ఎటువంటి హంగామా లేకుండా, సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న నేహా దూపియా ఇదిగో మావారు అని అభిమానులకు పరిచయం చేస్తున్నట్టుగా తన పెళ్లి కబురుని, పెళ్లి వేడుక ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''తాను జీవితంలో తీసుకున్న ఉత్తమమైన నిర్ణయం ఇది. ఇవాళే తన బెస్ట్ ఫ్రెండ్ అంగడ్ బేడీని పెళ్లి చేసుకున్నాను'' అంటూ నేహా దూపియా తన శ్రీవారిని అభిమానులకు, మీడియాకు పరిచయం చేసింది. ఎంతో కాలంగా డేటింగ్‌లో వున్న ఈ జంట.. గురువారం సిక్కు సంప్రదాయం ప్రకారం వివాహ బంధం ద్వారా ఒక్కటైంది.
అదే సమయంలో నేహా దూపియా భర్త అంగడ్ బేడీ సైతం తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో ఇటువంటి ప్రకటనే చేశాడు. తాను తన బెస్ట్ ఫ్రెండ్ నేహా దూపియాను పెళ్లి చేసుకున్నాను అని అంగడ్ తన పోస్టులో పేర్కొన్నాడు. వైట్, లైట్ పింక్ కలర్స్ దుస్తులు ధరించిన ఈ నూతన జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాల్లో నటించిన నేహా దూపియా తెలుగులో విలన్ సినిమాలో రాజశేఖర్ సరసన జంటగా నటించడంతోపాటు తరుణ్ హీరోగా తెరకెక్కిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించారు.