Sunny Leone PAN card was used to procure Rs 2,000 loan: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరు ఆన్‌లైన్‌లోనే నగదు లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి.. డెబిట్ కార్డు వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీ తెలుసుకుని డబ్బు దోచుకుంటున్నారు. సామాన్యులనే కాకుండా సెలెబ్రిటీలను కూడా కేటుగాళ్లు సునాయాసంగా బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌ కూడా సైబర్ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన పాన్‌ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారని సన్నీ లియోన్‌ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. 'ఎవరో ఇడియట్ నా పాన్ కార్డును ఉపయోగించి.. 2 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. లోన్ తిరిగి చెల్లించకుండా జాప్యం చేయడంతో నా సీబీల్ స్కోరు దెబ్బతింది. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది' అంటూ సన్నీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. 


సన్నీ లియోన్‌ ఫిర్యాదు మేరకు సంబంధిత బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సన్నీ పేరుపై లోన్‌ తీసుకున్న వ్యక్తులను గుర్తించి.. సమస్యను పరిష్కరించారు. దాంతో సన్నీ తన ట్వీట్‌ను డిలిట్‌ చేసి.. మరో ట్వీట్‌లో ఐవీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెపుతున్నా. వెంటనే నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నా. బ్యాడ్ సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు. థాంక్స్' అంటూ సన్నీ లియోన్‌ పేర్కొన్నారు. అయితే ఓ నెటిజన్‌కి కూడా ఇలాంటి సమస్యే ఎదురైతే సన్నీకి ట్వీట్ చేశాడు. ఈ సమస్యను కూడా పరిష్కరించండి అని ఆమె మరోసారి అధికారులను రిక్వెస్ట్ చేశారు.



శృంగార తారగా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన సన్నీ లియోన్.. ఆపై బాలీవుడ్‌కు వచ్చి స్థిరపడ్డారు. అనంతరం టాలీవుడ్, మాలీవుడ్‌లో మంచి ఆఫర్లను వచ్చాయి. తెలుగులో స్పెషల్ కారెక్టర్లు, ఐటం సాంగ్స్ చేశారు. ఇక సిల్వర్ స్క్రీన్ మీద సన్నీ అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. సన్నీకి మంచి మనసు కూడా ఉంది. పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నారు. దాంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


Also Read: Anasuya Bharadwaj: హలో.. నా వయసు 40 కాదు 36 మాత్రమే! జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్!!


Also Read: IND vs WI 2nd T20: టీమిండియాదే బ్యాటింగ్.. దీపక్, వెంకీ ఫిట్! పొలార్డ్‌కు ప్రత్యేక మ్యాచ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook