Bollywood love birds Ranbir Kapoor, Alia Bhatt wedding postponed: ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆలియా భట్‌, రణ్‌బీర్ కపూర్‌ పెళ్లి పెద్ద హాట్ టాపిక్ అయింది. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి ముహుర్తం, వివాహ కార్యక్రమాల గురించే అందరూ చర్చిస్తున్నారు. ముంబై నగరంలోని చెంబూర్‌లోని రణ్‌బీర్‌ కపూర్‌ బాంద్రా నివాసంలో ఈ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 14న బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ ఒక్కటి కాబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆలియా-ర‌ణ్‌బీర్‌ పెళ్లి వాయిదా ప‌డ్డ‌ట్లు తెలుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలీయా భట్‌లు త‌మ పెళ్లిని సీక్రెట్‌గా జ‌రుపుకోవాల‌ని ముహూర్తంను ఫిక్స్ చేసుకున్నార‌ట‌. అయితే ఆ తేదీలు బ‌య‌ట‌కు రావడంతో.. గ‌తవారం నుంచి వీరి పెళ్లి పెద్ద హాట్ టాపిక్ అయింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా తాజాగా పెళ్లిని వాయిదా వేశారట. బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ తమ పెళ్లిని వచ్చేవారానికి వాయిదా వేశారట. ఏప్రిల్ 20వ తేదీకి పోస్ట్ పోన్ చేసిన‌ట్లు సమాచారం తెలుస్తుంది. ఈ విషయంపై ఆలీయా భ‌ట్ క‌జిన్ రాహుల్ స్పందించారు.


రాహుల్ ఓ ఛాన‌ల్‌ ఇంట‌ర్వూలో మాట్లాడుతూ... 'నిజానికి ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలీయా భట్‌ల పెళ్లి ఏప్రిల్‌ 14, 15 తేదీలలో జరపాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెళ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించినా.. ముహూర్తపు తేదీలు బయటకు వచ్చాయి. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. పెళ్లి ఏప్రిల్‌ 20వ తేదీన జరిగే అవకాశం ఉంది' అని అన్నారు. 


ఇదే విషయమై రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఓ సినిమా సెట్స్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనకు పెళ్లి తేదీలు తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దామని చెప్పడం గమనార్హం. మరి రాహుల్ చెప్పినట్టు ఏప్రిల్‌ 20వ తేదీన ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలీయా భట్‌ల పెళ్లి జరుగుతుందో చూడాలి. పెళ్లి వార్త‌ల‌పై అటు ర‌ణ్‌బీర్ కానీ, ఇటు ఆలీయా కానీ ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. ఇక ర‌ణ్‌బీర్ మాజీ ప్రియురాళ్లు క‌త్రినా కైఫ్, దీపికా ప‌దుకొణెలు పెళ్లికి రానున్న‌ట్లు కూడా ప్ర‌చారం జరుగుతోంది.


Also Read: Deepak Chahar: వరుస ఓటముల్లో ఉన్న చెన్నైకి భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2022 నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్!


Also Read: Katrina Kaif Pregnancy: వైరల్‌ వీడియో.. తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook