Deepak Chahar: వరుస ఓటముల్లో ఉన్న చెన్నైకి భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2022 నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్!

CSK pacer Deepak Chahar out from IPL 2022. ఐపీఎల్ 2022లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌.. 15వ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 05:50 PM IST
  • వరుస ఓటముల్లో ఉన్న చెన్నైకి భారీ ఎదురుదెబ్బ
  • ఐపీఎల్ 2022 నుంచి దీపక్‌ చహర్‌ ఔట్
  • అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
Deepak Chahar: వరుస ఓటముల్లో ఉన్న చెన్నైకి భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2022 నుంచి స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఔట్!

CSK Pacer Deepak Chahar ruled out from IPL 2022 due to back injury: ఐపీఎల్ 2022లో భాగంగా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌..15వ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. వెన్ను నొప్పి కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని చహర్‌.. లీగ్‌లోని మిగిలిన మ్యాచులకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోని మూడో టీ20లో దీపక్‌ చహర్‌ గాయపడిన విషయం తెలిసిందే. బంతి వేసేందుకు రన్నింగ్ చేస్తుండగా.. దీపక్ కాలు పట్టేసింది. దాంతో తన ఓవర్లు పూర్తిచేయకుండానే అతడు మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం చహర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పర్యవేక్షణలో ఉంటున్నాడు. దాదాపు నెల రోజుల నుంచి ఎన్‌సీఏలోనే ఉంటూ ఫిట్‌నెస్ కోసం సాధన చేస్తున్నాడు. 

తాజాగా దీపక్ చహర్‌కు మరో గాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో అతను మరో నెల రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని సమాచారం. ఈ నెలరోజుల్లోగా ఐపీఎల్‌ 2022 ముగింపు దశకు చేరుకుంటుంది. కాబట్టి చహర్‌ ఈ సీజన్‌ మొత్తానికే దూరం కానున్నాడు. అయితే ఈ విషయంపై చెన్నై యాజమాన్యం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీపక్ స్థానంలో చెన్నై మరొక పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. చహర్‌ను చెన్నై రూ. 14 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ గెలవడంలో చహర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌లో కొత్త కెప్టెన్‌ రవీంద్ర జడేజా నేతృత్వంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ ఓటమిపాలైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చెన్నై ఆఖరి స్థానంలో నిలిచింది. బెంగళూరుతో ఈరోజు చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని చూస్తోంది. 

Also Read: Katrina Kaif Pregnancy: వైరల్‌ వీడియో.. తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌!

Also Read: Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ సభకు సమీపంలో బాంబు దాడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News