Sai Pallavi: స్టార్ హీరోయిన్ పై పగపట్టిన బాలీవుడ్.. కావాలనే బురద చల్లుతున్నారా?
Sai Pallavi Lover: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్న.. సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఈమె మీద వరుసగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావాలనే బాలీవుడ్ మీడియా.. సాయి పల్లవి మీద బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Sai Pallavi Controversy: గత కొద్దికాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. సాయి పల్లవి వ్యక్తిగత జీవితం కారణంగా.. వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఆమె ఎవరో పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న స్టార్ హీరోతో.. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందనే వార్తలు బయటకు రావడం. ఆ హీరో పేరు తెలియదు కానీ సాయి పల్లవి పేరు మాత్రం న్యూస్‌లో మారుమోగుతోంది.
అయితే వివరాల్లోకి వెళితే ఈ పుకార్లలో.. ఏమాత్రం నిజం లేదు. ఎవరో కావాలని సాయి పల్లవిని..బ్యాడ్ చేయడానికి ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈమెపై ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఎవరో పెళ్లైన వ్యక్తితో సాయి పల్లవి ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఎవరో కావాలని సృష్టించినవే తప్ప వీటిలో నిజం లేదు.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టబోతోంది. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు ఉండడంతో కావాలనే బాలీవుడ్ మీడియా ఈమెను ఇలాంటి వివాదాల్లో ఇరికిస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
బయటకు ఎన్ని పుకార్లు వినిపించినా ఎప్పుడు సాయి పల్లవికి మద్దతుగానే ఉంటామని అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇక రామాయణం సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.
Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి