బాలీవుడ్ ( Bollywood ) చిత్ర పరిశ్రమతో పాటు పలు ఇతర ఇండస్ట్రీ వర్గాలు కలిసి ఢిల్లీ హై కోర్డులో రెండు ప్రముఖ ఛానెల్స్ గురించి పటీషన్ వేసిన ఒక రోజు తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ విషయంలో బాలీవుడ్ చాలా ఆలస్యంగా స్పందించింది అని... చిన్నపిల్లల వలే రియాక్ట్ అయింది అని కామెంట్ చేశాడు వర్మ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో 


ఢిల్లీ హైకోర్డులో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రోడ్యూసర్ గిల్డ్ ( PGI ), సినీ అండ్ టీవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA)తో పాటు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ( IFTPC ) , స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ( SWA ) ఇతర 34 ప్రొడక్షన్ సంస్థలు కలిసి రెండు టీవీ ఛానెల్స్ కు వ్యతిరేకంగా పిటీషన్ వేశాయి. తమమై అనైతికంగా, బాధ్యత లేకుండా, పరువు నష్టం కలిగించే విధంగా వార్తలు వేస్తున్నట్టు వారు ఫిర్యాదు చేశారు.


దీనిపై స్పందించిన రామ్ గోపాల్  వర్మ ( RGV ) ట్వీట్ చేశారు. అందులో..


బాలీవుడ్ రియాక్షన్ చాలా నెమ్మదిగా, చల్లగా ఉంది. సినీ పరిశ్రమలోని పెద్దలంతా ఢిల్లీ హైకోర్డుకు వెళ్లిన విధానం చూస్తే .. స్కూల్లో పిల్లలు టీచర్ దగ్గరికి వెళ్లి.. టీచర్ టీచర్.. ఆ అర్నబ్ నన్ను తిడుగతున్నాడు అన్నట్టుగా ఉంది అని ట్వీట్ చేశాడు.



ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.



Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR