Alia Bhatt Hollywood debut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ షురూ అయింది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' (Heart Of Stone) అనే చిత్రం ద్వారా హాలీవుడ్ (Hollywood) అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో గాల్ గాడోట్ (Gal Gadot), జామీ డోర్నన్ వంటి స్టార్ నటులతో కలిసి తెరను పంచుకోనుంది. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టామ్ హార్పర్ ( Tom Harper) దర్శకత్వం వహించనున్నారు. దీనిని నెట్‌ఫ్లిక్స్ , స్కైడాన్స్ తీసుకురానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలియా ఫోటోను నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ... "ఆలియా భట్ 'హార్ట్ ఆఫ్ స్టోన్‌'లో ఉండబోతోందని ప్రకటించడం ద్వారా మా రోజును ప్రారంభించాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, దివంగత ఇర్ఫాన్ ఖాన్, అలీ ఫజల్ వంటి బాలీవుడ్ తారలు హాలీవుడ్ చిత్రాల్లో మెరిశారు. తాజాగా ఈ కోవలోకి ఆలియా చేరింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.



ఇతర చిత్రాల విషయానికొస్తే...
ఇటీవల 'గంగూబాయి కతియావాడి' చిత్రంలో ఆలియా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు. ఇందులో ఆలియా నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie)మూవీలోనూ నటించింది ఆలియా. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా ఆమె షారుఖ్ ఖాన్‌తో కలిసి నిర్మిస్తున్న డార్లింగ్స్‌లో కూడా నటించనుంది. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కుస్తున్న 'జీ లే జరా' సినిమాలోనూ కత్రినా కైఫ్‌తో కలిసి నటించనుంది. రణ్‌వీర్ సింగ్‌తో 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'లో నటిస్తోంది. తన బాయ్​ఫ్రెండ్​ రణ్​​బీర్​ కపూర్​తో కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' 2022 సెప్టెంబర్​ 9న రిలీజ్ కానుంది. 


Also read: Mahesh babu with Ali Bhatt: త్వరలో రాజమౌళి, అలియా భట్, మహేశ్ బాబు కాంబినేషన్ మూవీ, ఇవే ఆ వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి