Mahesh babu with Ali Bhatt: త్వరలో రాజమౌళి, అలియా భట్, మహేశ్ బాబు కాంబినేషన్ మూవీ, ఇవే ఆ వివరాలు

Mahesh babu with Ali Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ తెలుగు తెరపై అవకాశాలు పెరుగుతున్నాయి. బాహుబలి రాజమౌళికి క్యూట్‌గా ఉండే లేత బుగ్గల బ్యూటీ అలియా భట్ మాత్రమే ఆప్షన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, హీరో ఎవరు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2022, 11:45 AM IST
Mahesh babu with Ali Bhatt: త్వరలో రాజమౌళి, అలియా భట్, మహేశ్ బాబు కాంబినేషన్ మూవీ, ఇవే ఆ వివరాలు

Mahesh babu with Ali Bhatt: బాలీవుడ్ నటి అలియా భట్ తెలుగు తెరపై అవకాశాలు పెరుగుతున్నాయి. బాహుబలి రాజమౌళికి క్యూట్‌గా ఉండే లేత బుగ్గల బ్యూటీ అలియా భట్ మాత్రమే ఆప్షన్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, హీరో ఎవరు..

బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మార్చ్ 25 విడుదల కానుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె. బాలీవుడ్‌లో సత్తా చాటుకుంటూనే పాన్ ఇండియా మూవీ అలియా భట్‌తో తెలుగుతెరకు సైతం దగ్గరవుతోంది. ఈ సినిమాలో రామ్‌‌చరణ్ సరసన అలియా నటిస్తోంది. 

ఆర్ఆర్ఆర్ ఇంకా విడుదల కాకముందే తెలుగు సినిమాలో ఆమెకు ఆపర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న సినిమాలో అలియా భట్ హీరోయిన్ అనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొరటాల శివ ఈ దిశగా ఆమెతో చర్చించినట్టు సమాచారం. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక మరో ముఖ్యమైన అప్‌డేట్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన అలియా భట్ నటించనుందనే విషయం. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి త్వరలో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం తన ఆర్ఆర్ఆర్ ముద్దుగుమ్మనే ఆప్షన్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి పరిశీలిస్తున్న పేర్లలో అలియా భట్ పేరు ముందు వరుసలో ఉందట. మహేశ్ సరసన అలియా భట్ జంట వెండితెరపై ఎలా ఉంటుందో మరి.

Also read: Megastar Chiranjeevi: సినిమా టికెట్ల ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News